E-Paper
Advertisement

I Bomma Ravi Arrest: మూడు దేశాలు తిప్పించారు… ఇంటర్నేషనల్ క్రైమ్ థ్రిల్లర్‌లా ఐబొమ్మ రవి అరెస్ట్ ఎపిసోడ్

I Bomma Ravi Arrest: మూడు దేశాలు తిప్పించారు… ఇంటర్నేషనల్ క్రైమ్ థ్రిల్లర్‌లా ఐబొమ్మ రవి అరెస్ట్ ఎపిసోడ్
Advertisement

IBomma Ravi Arrest: ఐ బొమ్మ రవి ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా సినిమాలను పైరసీలకు గురి చేస్తూ ఏకంగా వందల కోట్ల డబ్బును సంపాదించారు. ఇలా సినిమాలను పైరసీ చేస్తున్న రవి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈయనకు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇక నేడు మధ్యాహ్నం మరోసారి ఈయనని కోర్టుకు తీసుకు వెళ్ళనున్నారు. ఇలా ఇమ్మడి రవి పోలీస్ విచారణలో భాగంగా పెద్దగా పోలీసులకు సహకరించలేదని తెలుస్తుంది అయితే తాజాగా ఇమ్మడి రవి అరెస్ట్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈయన అరెస్టు ఇంటర్నేషనల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలా ఉందని చెప్పాలి.  మరి రవి అరెస్టుకు గల కారణాలు ఏంటి ఈయన పోలీసులకు ఎలా పట్టుబడ్డారు అనే విషయానికి వస్తే..

రవి అరెస్టు వెనుక ఇంత కథ నడిచిందా..

బొమ్మ రవి ఒక ఈమెయిల్, డొమైన్స్ ఐపీ అడ్రస్ కారణంగా పోలీసులకు దొరికిపోయారు. ఇమ్మడి రవి పై నిగా ఉంచిన పోలీసులు ఆయన విదేశాలలో ఉన్నప్పుడే తనని ఫాలో చేస్తూ ఉన్నారనే తెలుస్తుంది.

Advertisement

*రవి నిర్వహించే 65 డార్క్ వెబ్సైట్స్ అన్నీ కూడా తన అమెరికా కంపెనీ ఈఆర్ ఇన్ఫ్రాటెక్ ద్వారా నిర్వహించేవారు.

*అమెరికా కంపెనీ అయితే ఎక్కడ అనుమానం రాదని రవి భావించారు కానీ చివరికి అదే కంపెనీ రవిని పోలీసులకు పట్టించింది.

Advertisement

*ఐ బొమ్మ రవికి చెందిన సర్వర్లు ఐపీ అడ్రస్ వివరాలను ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు.

*ఎప్పుడైతే రవి పైరసీ సినిమాలను అప్లోడ్ చేసారో వెంటనే సర్వర్ల అడ్రస్ ఆధారంగా డొమైన్ నోడల్ అధికారి ఫోన్ నెంబర్ ను కూడా పోలీసులు సేకరించారు.

*ఈ విషయాలన్నీ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచిన సంగతి తెలిసిందే. అయితే డొమైన్ నోడల్ అధికారి ఇమ్మడి రవి అనే విషయాన్ని ముందుగా పోలీసులు గ్రహించలేదు.

* ఎప్పుడైతే నోడల్ అధికారి అంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి ఐ బొమ్మ,  బప్పం డొమైన్లలో పైరసీ  సినిమాలు ఉన్నట్లు ఆధారాలు పంపాలంటూ మెయిల్ చేశారు. ఇలా మెయిల్ రావడంతోనే పోలీసులకు అనుమానం వచ్చింది.

*ఇలా పోలీసులు అనుమానం వ్యక్తం చేయడంతో ఈ విషయాన్ని గ్రహించిన రవి, తాను నెదర్లాండ్ లో ఉన్నట్టు పోలీసులకు అనుమానం వచ్చిందని జాగ్రత్త పడ్డారు.

*ఈ క్రమంలోనే పోలీసు విచారణలో భాగంగా నాకోసం నెదర్లాండ్స్  వచ్చింది కూడా మీరేనా అంటూ ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులని ఎదురు ప్రశ్నలు వేసినట్టు సమాచారం.

* ఇలా రవికి పోలీసులు తనకోసం వెతుకుతున్నారు అనే అనుమానం మొదలైనప్పటి నుంచి 20 రోజులపాటు పోలాండ్, ఫ్రాన్స్ కి వెళ్ళాడు. ఇలా అనుమానంతోనే రెండు మూడు దేశాలలో పర్యటించి పోలీసులు తనకోసం వెతకలేదని నిర్ధారణకు వచ్చారు.

*పోలీసుల నుంచి కూడా తిరిగి ఎలాంటి మెయిల్ రాకపోవడంతో ఈయన చాలా ధైర్యంగా హైదరాబాద్ వచ్చారు.

* పోలీసులు మాత్రం చాలా రహస్యంగా రవి కదలికలపై నిఘా ఉంచి ఆయన హైదరాబాదులోకి అడుగుపెట్టగానే సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Akhanda 2 pre Release: అఖండ 2 ప్రీ రిలీజ్.. లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చిన బన్నీ…అదే కారణమా?

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×