E-Paper
Advertisement

Akhanda 2 pre Release: అఖండ 2 ప్రీ రిలీజ్.. లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చిన బన్నీ…అదే కారణమా?

Akhanda 2 pre Release: అఖండ 2 ప్రీ రిలీజ్.. లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చిన బన్నీ…అదే కారణమా?
Advertisement

Akhanda 2 pre Release: నందమూరి బాలకృష్ణ (Balakrishna)బోయపాటి (Boyapati)కాంబినేషన్లో రాబోతున్న అఖండ 2 (Akhanda 2)సినిమా విడుదలకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో డిసెంబర్ 4వ తేదీనే పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఒకరోజు ముందుగానే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్న నేతంలో బాలయ్య అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.

అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇప్పటికే ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున సినిమా ఈవెంట్స్ నిర్వహిస్తూ వరుస అప్డేట్స్ తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ,ట్రైలర్ వంటివి సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి .ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుపుకుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను(Pre Release Event) ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ యూసఫ్ గూడాలో ఈనెల 28వ తేదీ నిర్వహించబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి.

ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి..

Advertisement

ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇలా ఈ వేడుకకు ఇద్దరు ముఖ్య అతిథులుగా రాబోతున్నారనే విషయం అభిమానులలో మరింత సంతోషాన్ని కలిగించింది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వేడుకకు బన్నీ దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబైలో అట్లీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా తన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ రావడం లేదని తెలుస్తుంది.

ప్రీ రిలీజ్ వేడుకకు దూరంగా బన్నీ..

Advertisement

ఇలా అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న నేపథ్యంలో కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే హాజరు కాబోతున్నట్లు సమాచారం. అయితే ప్రీ రిలీజ్ వేడుకకు దూరంగా ఉన్న బన్నీ సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అధికారక ప్రకటన వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై గోపి అచంట రామ్ ఆచంట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Also Read: Spirit Release : సందీప్ రెడ్డి షాకింగ్ డెసిషన్… సంక్రాంతి బరిలో ప్రభాస్ మూవీ

Related News

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×