E-Paper
Advertisement

IBomma Ravi Case: తప్పుచేశాను, ఇక పైరసీ చేయను.. పోలీసుల ఎదుట ఐబొమ్మ రవి పశ్చాత్తాపం

IBomma Ravi Case: తప్పుచేశాను, ఇక పైరసీ చేయను.. పోలీసుల ఎదుట ఐబొమ్మ రవి పశ్చాత్తాపం
Advertisement

IBomma Ravi Case: పైరసీ కింగ్‌, ఐబొమ్మ ఇమ్మడి రవి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అరెస్ట్‌ అయినప్పటి నుంచి విచారణలో అతడు సహకరించడం లేదని ఆరోపిస్తూ పోలీసులకు రవి కస్టడీని పెంచుకుంటుపోతున్నారు. మరో మూడు రోజుల గడువు కావాలని ఇటీవల కోర్టును పోలీసులు కోరిన సంగతి తెలిందే. ఈ రోజుతో ఐబొమ్మ రవి మూడు రోజుల కస్టడీ గడువు ముగించింది. ఈ మూడు రోజుల కస్టడీలో రవి పోలీసుల ఎదుట ప్రశ్చాత్తాపానికి లోనయ్యాడట. ఇక తాను మారిపోతానని, ఇకపై పైరసీ జోలికి వెళ్లనంటూ పోలీసుల ఎదుట తగ్గడినట్టు సమాచారం.

విదేశీ పౌరసత్వం ఉన్న ధీమతోనే

Advertisement

కాగా విదేశీ పౌరసత్వం వల్ల తాను పోలీసులకు పట్టుబడననే నమ్మకంతో ఉన్నానని, ఐదారు సంవత్సరాలుగా తనని ఎవరూ పట్టుకోలేదు కాబట్టి, ఇకపై కూడా పట్టుకోరనే ధీమాతోనే పోలీసులకు సవాలు విసిరినట్టు చెప్పాడు. కానీ ఇప్పుడు తను బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నాని, ఇకపై సినిమాలు పైరసీ చేయనని పోలీసుల ఎదుట ప్రశ్చాత్తాప పడినట్టు తెలుస్తోంది. ఏపీకి చెందిన ఇమ్మడి రవి కొంతకాలంగా ఐబొమ్మ, బప్పం టీవీ వైబ్‌ సైట్ల ద్వారా కొత్త సినిమాలను పైరసీకి పాల్పడుతూ పోలీసులకు, సినీ పరిశ్రమకు సమస్యగా మారాడు. దాదాపు ఐదారేళ్లుగా పైరసీకి పాల్పడుతూ కోట్లలో డబ్బు సంపాదించాడు.

మొత్తం 5 కేసులు

Advertisement

కొంకాలంగా అతడిపై నిఘా పెట్టిన పోలీసులు ఇండియాకు వచ్చిన అతడిని ఓ ఇ–మెయిల్‌ ద్వారా గుర్తించి పట్టుకున్నారు. అతడు అరెస్టై దాదాపు నెల రోజుల అవుతుంది. దాదాపు అతడిపై ఐదు కేసులు నమోదవ్వడా మొదటి కేసు కోసం ఐదు రోజుల కస్టడీ, రెండో కేసులో మూడు రోజుల కస్టడీకి అనుమతి తీసుకున్నారు పోలీసులు. ఈ విచారణలో అతగడి నుంచి కీలక వివరాలు సేకరించారు. ఐబొమ్మ, బప్పంలో సినిమాలను పైరసీ చేసేందుకు మూవీరూల్జ్‌, టెలిగ్రామ్‌ల ద్వారా కొనుగొలు చేసి వాటిని హెచ్‌డీ చేసి ఐబొమ్మ, బప్పంలో సినిమా పెట్టినట్టు ఒప్పుకున్నాడు. హై టెక్కాలజీతో సర్వర్లను మెయింటెన్‌ చేస్తూ కోట్ల రూపాలు దండుకున్నాడు.

మొత్తం రూ. 30 కోట్ల వరకు లావాదేవీలు

అయితే ఇప్పటి వరకు రూ. 30 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అతడి బ్యాంక్‌ లావాదేవీలు, ఇంటర్నేషనల్‌ స్థాయి జరిగిన ట్రాన్స్‌క్షన్స్‌, ఇతర లావాదేవీలపై లోతుగా విచారణ జరపాల్సి ఉందట. అదే విధంగా ఐబొమ్మ రవికి సినీ ఇండస్ట్రీలో కూడా ఏమైనా పరిచయాలు ఉన్నాయా? ఇంకా అతడి నెట్‌వర్క్‌ ఎంతవరకు ఉంది.. ఇందులో ఇంకా ఎవరెవరూ ఉన్నారనే దానిపై పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. అయితే భారీ బడ్జెట్‌, పాన్‌ ఇండియా చిత్రాలను విడుదలైన ఒక్క రోజులోనే ప్రీగా బప్పం, ఐబొమ్మ ద్వారా ప్రజలకు అందించిన అతడికి బయటక పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. పీవీఆర్‌, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూసే అవకాశం లేని సామాన్య ప్రజలు మా దేవుడంటూ రవికి సపోర్టు చేస్తున్నారు. ఇంత ఎత్తున్న సపోర్టు వస్తున్న రవి కేసు ఇక ముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×