E-Paper
Advertisement

IBomma Ravi: సైబర్ క్రైమ్ కస్టడీలోకి ఐ బొమ్మ రవి.. వెలుగులోకి సంచలన విషయాలు!

IBomma Ravi: సైబర్ క్రైమ్ కస్టడీలోకి ఐ బొమ్మ రవి.. వెలుగులోకి సంచలన విషయాలు!
Advertisement

IBomma Ravi: ఐ బొమ్మ రవి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈయన ఐ బొమ్మ(Ibomma) ద్వారా పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేస్తూ వందల కోట్ల రూపాయలు సంపాదించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి వేల కోట్లు నష్టాన్ని తీసుకువచ్చారు. ఇలా సినిమా పైరసీలను అడ్డుకోవడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గత కొంతకాలంగా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పైరసీ తిమింగలం ఐ బొమ్మ రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈయన చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు కోర్టు ఈయనకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈయన జైలులోనే ఉన్నారు.

సైబర్ క్రైమ్ కస్టడికి ఐ బొమ్మ రవి..

ఇకపోతే ఐ బొమ్మ రవిని చంచల్ గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ కస్టడి(Cyber Crime Custody)కి తీసుకోబోతున్నారు. మరి కాసేపట్లో రవిని సైబర్ క్రైమ్ కార్యాలయానికి తరలించనున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు రవికి సైబర్ క్రైమ్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. సైబర్ క్రైమ్ కార్యాలయంలో పోలీసులు విచారణ కొనసాగించబోతున్నారని తెలుస్తుంది. ఈ విచారణలో భాగంగా పైరసీకి సంబంధించి మరికొన్ని సంచలన విషయాలను రాబట్టే ప్రయత్నం చేయబోతున్నారు. రవి పైరసీ కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల వరకు వ్యాప్తించింది. ఈయన వెనుక పెద్ద నెట్వర్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ కస్టడీలో భాగంగా రవి నుంచి మరింత సమాచారాన్ని తెలుసుకోబోతున్నారు.

రవికి పెరుగుతున్న మద్దతు..

Advertisement

ఇక రవి అరెస్టు అయినప్పటికీ సినిమాలు పైరసీలో అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమా థియేటర్లలో విడుదలైన రెండు రోజులకే హెచ్డి ప్రింట్ తో సహా బయటకు వచ్చింది దీంతో సినిమా పైరసీ వెనుక కేవలం రవి ప్రమేయం మాత్రమే కాదని ఈ పైరసీ వెనుక పెద్ద ముఠా ఉందని స్పష్టం అవుతుంది. ఇక రవి అరెస్టు కావడంతో కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే వ్యతిరేకించినా, రవికి మాత్రం సోషల్ మీడియా వేదికగా భారీ స్థాయిలో మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే.

సినిమా టికెట్ల రేట్లు పెంచడమే..

Advertisement

రవి సినిమాలను పైరసీ చేయటం ద్వారా ఎంతో మంది థియేటర్లకు వెళ్ళలేని వారు కూడా సినిమాని చూసే అవకాశం కల్పించారు అంటూ ఈయనని ఒక హీరోగా భావించి తన అరెస్టును వ్యతిరేకిస్తూ మద్దతు తెలియజేస్తున్నారు.  కేవలం దర్శక నిర్మాతల కారణంగానే రవి లాంటి వాళ్లు పుట్టుకొస్తున్నారని రవి లాంటి వాళ్లను తయారు చేస్తుందే సినిమా ఇండస్ట్రీ అంటూ ఎంతోమంది రవి అరెస్టును ఖండించారు. సినిమా చేయడం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆ భారం మొత్తం ప్రేక్షకులపై వేయటం వల్లే సినిమాలను ఇలా పైరసీలో విడుదల చేస్తున్నారని సినిమా టికెట్ల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటే ఎవరు కూడా పైరసీలో సినిమాలను చూడాలనుకోరు. ఇలా సినిమాలు పైరసీ అవుతున్నాయి అంటే అందుకు కారణం దర్శక నిర్మాతలేనని ముందు వారి ధోరణి మార్చుకోవాలి అంటూ పలువురు రవి అరెస్టు పట్ల వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Also Read: santhana prapthirasthu OTT: ఒకేసారి రెండు ఓటీటీలలో సంతాన ప్రాప్తిరస్తు..

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×