E-Paper
Advertisement

IBomma Ravi Case : ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్… అతను పైరసీ చేయలేదు?

IBomma Ravi Case : ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్… అతను పైరసీ చేయలేదు?
Advertisement

IBomma Ravi Case: ఒకప్పుడు సినిమా అనేది అందరికీ అందుబాటులో ఉండేది. కానీ ఈరోజు సినిమా టిక్కెట్లు రేట్లు చూస్తుంటే భారీగా ఉన్నాయి. అందుకనే సినిమాలు పైరసీ చేసే వాళ్లను కూడా కొంతమంది సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అయితే టిక్కెట్ రేట్లు విషయంలో ప్రొడ్యూసర్ ఎంత లాభాన్ని గడిస్తాడు అనే విషయాన్ని పక్కన పెడితే పెద్ద సంఖ్యలో వసూలు చేస్తున్నారు అనేది మాత్రమే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ లో ఉండిపోయింది. ఈ తరుణంలో ఎక్కువ మంది ఓటీటీకి అలవాటు పడిపోయారు. అలానే ఐ బొమ్మ వెబ్సైట్లో ఫ్రీగా సినిమాలు చూడటం ఎక్కువగా అలవాటు చేసుకున్నారు.

Advertisement

నీ చేతిలో ఉన్న మొబైల్ లో ఫ్రీగా సినిమా వచ్చేస్తుంటే థియేటర్కి వెళ్లి డబ్బులు పెట్టుకుని చూసే ఆలోచనే మానేశారు ప్రజలు. థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్లు మాత్రమే థియేటర్కు వెళ్లి సినిమా చూసి ఎంజాయ్చేస్తున్నారు. మహిళలు, మధ్య తరగతి మైండ్సెట్వాళ్లంత ఐబొమ్మ, మూవీ రూల్స్వంటి పైరసీ వెబ్సైట్లు ఫాలోయిపోతున్నారు. అందుకే భారీ పైరసీ చేసిన ఐబొమ్మ ఇమ్మడి రవికి ప్రజల్లో అంత మద్దతు లభిస్తోంది. తప్పు అయినా కూడా దానిని ఎక్కువ శాతం మంది సమర్థిస్తున్నారు అంటే ఇండస్ట్రీ వైపు నుంచి కూడా కొన్ని లోపాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.

ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్

ఐ బొమ్మ రవి చాలా సినిమాలను పైరసీ చేస్తున్నాడు అని అతని మీద కేసులు పెట్టి పోలీసులు విచారిస్తున్నారు. అతడి అరెస్టు ఐబొమ్మ రవి తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్అయ్యాడు. ప్రస్తుతం ఎక్కడ చసిన ఇమ్మడి రవి పేరు గట్టిగా వినిపిస్తుంది. అలానే కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తుంది. తాజాగా iBOMMA రవి నేరుగా సినిమాలు పైరసీ చేయలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్ంవీ లాంటి పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసేవాడని తెలిపారు. క్వాలిటీ తక్కువగా ఉన్న ఆ సినిమాలను టెక్నాలజీ సాయంతో HD క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ, బప్పం సైట్లలో పోస్ట్ చేసేవాడని దర్యాప్తు తేలింది. అయితే గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు.

సినిమా మీద ఆసక్తి బెట్టింగ్ దారి

Advertisement

మొత్తానికి పైరసీ చేయకపోయినా కూడా ఒకరకంగా పైరసీ సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే అది కూడా ఒక క్రైమ్ అని చెప్పాలి. మొత్తానికి ఇటువంటి క్రైమ్ చేస్తూ బీభత్సంగా డబ్బులు సంపాదించడమే కాకుండా బెట్టింగ్ ప్రమోషన్ వలన కొంతమంది కుటుంబాల ఉసురు కూడా తీసుకున్నట్లే. చాలామంది ఫ్రీగా సినిమా చూడాలి అనే ఉద్దేశంతో ఫైర్ సి సినిమాలను ఓపెన్ చేయడం మొదలుపెడతారు. దాంట్లో ఉన్న కొన్ని యాడ్స్ చూసి బెట్టింగ్ వైపు ఆసక్తి చూపుతారు. ఇక బెట్టింగ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి ఆ ఊబిలోకి దిగాము అంటే బయటపడటం అనేది చాలా కష్టం. అలా జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళ గురించి కూడా తరచూ న్యూస్ లో వింటూనే ఉంటాం. అయితే ఒకవైపు కొంతమంది రవికు మద్దతు చూపుతున్నారు. సినిమా మీద ఆసక్తి ఉన్నవాళ్లు, కొంతమంది సినిమా వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి అని చెబుతున్నారు. ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది తెలిసింది. మరి రవి కేసులో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×