E-Paper
Advertisement

Delhi Blast Case Update: ఢిల్లీ బ్లాస్ట్ కేసు, వాళ్లిద్దరు భార్యాభర్తలే, ఆపై నిధులు సేకరణ కూడా

Delhi Blast Case Update: ఢిల్లీ బ్లాస్ట్ కేసు, వాళ్లిద్దరు భార్యాభర్తలే, ఆపై నిధులు సేకరణ కూడా
Advertisement

Delhi Blast Case Update:  ఢిల్లీ బ్లాస్ట్ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? లోతుకి వెళ్లిన కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? నిందితుడు ముజమ్మిల్ కీలక విషయాలు బయటపెట్టాడా? పేలుడు పదార్థాలు కొనుగోలు డబ్బులు ఇచ్చిందెవరు? వీళ్లకి ఏయే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి? వాటిలో లోతుగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ.

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కొత్త కోణం

Advertisement

ఢిల్లీ పేలుడు కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ఐఏ విచారణలో టెర్రర్ మాడ్యూల్ నిందితుడు ముజమ్మిల్ షకీల్ కీలక విషయాలు బయటపెట్టాడు. నిందితురాలు డాక్టర్‌ షాహిన్‌ షహిద్‌ గాళ్‌ఫ్రెండ్ కాదని, తన భార్య అని చెప్పాడట. మా ఇద్దరికి రెండేళ్ల కిందట నిఖా జరిగిందని తేల్చి చెప్పినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.

అల్‌-ఫలా యూనివర్సిటీ సమీపంలో మతపరమైన ప్రదేశం వేదికైందంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2023లో ఆయుధాలు కొనుగోలుకు ముజమ్మిల్‌కు రూ.6.5 లక్షలు ఇచ్చిందని డాక్టర్‌ షాహిన్‌ ఇచ్చినట్టు గుర్తించారు. గతేడాది బాంబర్ ఉమర్ నబీకి ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వాహనం కొనుగోలుకు మూడు లక్షలు ఇచ్చినట్లు తేలింది.

Advertisement

ముజమ్మిల్-షాహిన్‌ వాళ్లిద్దరు భార్యాభర్తలు

ఈ నేపథ్యంలో ముజమ్మిల్-షాహిన్‌ మధ్య రిలేషన్ వెలుగులోకి వచ్చింది. డాక్టర్ షాహిన్‌‌కు జైషే మహమ్మద్ సంస్థతో సంబంధాలు ఉన్నాయా? లేవా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  పలు విడతలుగా   ఆయుధాలు-పేలుడు పదార్థాలు సమీకరించుకునేందుకు దాదాపు పాతిక లక్షలు డాక్టర్ షాహిన్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ నిధులను మతపరమైన విరాళాలు కోసం ఇచ్చినట్లు ఆమె విచారణాధికారులతో చెప్పిందని తెలుస్తోంది. దాడిలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించడానికి వివిధ రాష్ట్రాలలో దర్యాప్తు చేస్తున్నారు NIA అధికారులు. 2016 నుండి బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్, గండర్‌బాల్‌ల్లో యాక్టివ్ గా పని చేస్తున్న ఈ మాడ్యూల్స్, పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్ల సూచనల మేరకు పని చేస్తున్నట్లు భావిస్తున్నారు.

ALSO READ:  రెండు కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు, మరో విడత తొలగింపు?

డాక్టర్ షాహిన్‌.. జైష్-ఎ-మొహమ్మద్ గ్రూపులో మహిళా విభాగంలో కీలక పాత్ర పోషిస్తోందని తేలింది. ఆ గ్రూపు మహిళా బ్రిగేడ్‌ల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభించినట్లు సమాచారం. పాక్‌‌లో ఉగ్రవాదుల నుంచి అందుతున్న ఆదేశాలతో భారత్‌లో మహిళా విభాగాలు స్థాపించారని అంటున్నాయి దర్యాప్తు బృందాలు. ఇక ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఇప్పటివరకు ఏడుగుర్ని అరెస్టు చేసింది ఎన్ఐఏ.

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×