E-Paper
Advertisement

జస్ట్ ‘నో’ చెప్పడమే పాపమా.. సింగర్ హత్య వెనుక బయటపడుతున్న భయంకర నిజాలు!

జస్ట్ ‘నో’ చెప్పడమే పాపమా.. సింగర్ హత్య వెనుక బయటపడుతున్న భయంకర నిజాలు!

Inder Murder : ఇందర్ కౌర్ (29)..పంజాబీ సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్న తార, ‘ఫోక్ క్వీన్’గా యువతలో ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇందర్ కౌర్ (29) మర్డర్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అవుతుంది. పాటలు పాడుతూ, వేలమంది అభిమానులను అలరించిన ఇందర్ కౌర్, ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా నిజ జీవితంలో ఘోరానికి బలైపోవడం ఇప్పుడు పంజాబ్ గ్లామర్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. మే 13న సాయంత్రం తన ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లిన ఇందర్ కౌర్, తిరిగి రాకపోవడంతో మొదలైన ఈ మిస్టరీ, ఆరు రోజుల తర్వాత లూథియానాలోని కాలువలో శవమై కనిపించడంతో విషాదకరంగా ముగిసింది. అయితే ఈ కేసులో కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు ఇప్పుడు కళ్లు చెమర్చేలా ఉన్నాయి.

అసలు విషయం బయటపెట్టిన జోతింధర్

విషయంలోకి వెళ్తే మోగా జిల్లా భలూర్‌ గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్ అలియాస్ సుఖా ఇందర్ కౌర్‌ను  పెళ్లి చేసుకోవాలని వేదించాడు.కాని సుఖ్వీందర్‌కు అప్పటికే కెనడాలో భార్యాపిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని ఇందర్ కౌర్ తెలుసుకొని, పెళ్లికి నో చెప్పడమే ఆమె చేసిన పాపం.దీంతో పగ పెంచుకున్న సుఖ్వీందర్, తన స్నేహితుడు కరమ్‌జిత్‌ సింగ్‌తో కలిసి మే 15న తుపాకీతో బెదిరించి ఇందర్ కౌర్‌ను కిడ్నాప్ చేసి మత్తు బెట్టాడు అంటూ అంటూ అసలు విషయాన్ని కుండ బద్దలు కొట్టాడు  ఆమె సోదరుడు జోతింధర్ సింగ్.

also read :పెద్ది ట్రైలర్ రివ్యూ.. రామ్ చరణ్ ‘బీస్ట్ మోడ్’.. బుచ్చిబాబు ప్యూర్ మాస్ జాతర!

పోలీసుల ఆలస్యం

ఈ కేసులో షాక్ అయ్యే మరో యాంగిల్ ఏంటంటే పోలీసుల లేట్ రియాక్షన్. ఇందర్ కౌర్ కనిపించడం లేదని మే 13 రాత్రే కుటుంబ సభ్యులు జమల్పూర్‌ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఫైల్ చేసినా పై ఆఫీసర్ లేరని చెప్పి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పోలీసులు ఆలస్యం చేసిన పరిస్థితి.నిందితుడి పేరు చెప్పినా సరైన సమయంలో రియాక్ట్ కాకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవేళ పోలీసులు అప్పుడే స్పందించి ఉంటే ఇందర్ కౌర్ ప్రాణాలు దక్కేవని, నేరస్తులు పట్టుబడేవారని ఆమె కుటుంబం రోదిస్తుంది. ఇక  సుఖ్వీందర్, కిడ్నాప్ చేశాక నేరుగా కెనడా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.

ప్రముఖులు కూడా దారుణమైన పరిస్థితుల్లో

ఏది ఏమైనా పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీకి ఇలాంటి హింసాత్మక ఘటనలు కొత్తేమీ కాదు.గతంలో సిధూ మూసేవాలా, అమర్ సింగ్ చమ్కిలా వంటి ప్రముఖులు కూడా ఇలాగే దారుణమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. అక్కడ పాటలతో పాటు గ్యాంగ్‌స్టర్ కల్చర్, గన్స్, రివెంజ్ అనేవి అక్కడ ఒక సోషల్ స్టేటస్ గా మారిపోయాయి.ముఖ్యంగా సినిమాల్లో చూపించే ‘పవర్ పాలిటిక్స్’ నిజ జీవితంలో సింగర్ల ప్రాణాలను తీస్తోంది. పాప్ కల్చర్‌కు, క్రైమ్ మాఫియాకు మధ్యలో నలిగిపోతున్న కళాకారుల జాబితాలో ఇందర్ కౌర్ చేరడం విచారకరం.

మరో సెలబ్రిటీ హత్య కేసులా నీరు కారిపోతుందా

ఇప్పుడు పర్సనల్ శత్రుత్వంతో  పాటు గ్యాంగ్‌స్టర్ లింకుల కోణంలో కూడా విచారణ జరుపుతామని అంటున్నారు పోలీసులు. అయితే, ప్రాణం పోయాక జరిపే ఈ ఇన్వెస్టిగేషన్ కి  ఏమాత్రం విలువ ఉంటుందనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. కెనడా నుంచి వచ్చి పంజాబ్‌లో రక్తపుటేరులు పారించి, మళ్ళీ అదే కెనడాకు పారిపోయిన సుఖ్వీందర్ సింగ్‌ను పట్టుకుని, చట్టం తన పని తాను చేస్తుందా లేక మరో సెలబ్రిటీ హత్య కేసులా నీరు కారిపోతుందా అన్నది కాలమే డిసైడ్ చేయాలి.

also read :‘పెద్ది’ రిలీజ్ ముంగిట టాలీవుడ్‌లో హైడ్రామా.. ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయం

 

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×