Peddi Release : పెద్ది ఏ ముహూర్తాన మొదలెట్టారో కాని సినిమా రిలీజ్ అవ్వాలంటే ఆపసోపాలు పడేలానే కనిపిస్తుంది.మొన్నటి మొన్న దిల్ రాజు మాట్లాడుతూ సినిమా కి అడ్డంకులు ఏమీ లేవని, సినిమా చాలా గ్రాండ్ గా జూన్ 4న థియేటర్ లోకి అడుగుపెడుతుందని కరాఖండిగా చెప్పేయడం తో మురిసిపోయారు మెగా ఫ్యాన్స్. ఇక మా వాడి సినిమాకి అడ్డే లేదంటూ కాలర్ ఎగరేశారు.కాని వాలకం చూస్తుంటే సినిమా పర్సెంటేజీ పంచాయితీ చిక్కుకునేలానే కనిపిస్తుంది.
పర్సంటేజీల పంచాయితీ మరో కీలక మలుపు
విషయంలోకి వెళ్తే గత కొన్ని రోజులుగా నలుగుతున్న సినిమా బిజినెస్, థియేటర్ల రెంట్లు, పర్సంటేజీల పంచాయితీ ఈ రోజు మరో కీలక మలుపు తిరిగింది. ఫిల్మ్ చాంబర్‌లో నేడు జరిగిన మరో రౌండ్ హై-వోల్టేజ్ సమావేశం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. ఈ మీటింగ్‌లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య సయోధ్య కుదరడం కోసం గంటల తరబడి సుదీర్ఘ చర్చలు జరిగాయి.
also read :పెళ్లయిన 5 నెలలకే నరకం .. టాలీవుడ్ నటి డెత్ మిస్టరీ..లవ్ మ్యారేజ్ చివరకు ఇలా ముగిసిందా?
ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా రిలీజ్ ముంగిట ఉండటంతో ఈ మూవీకి కూడా కచ్చితంగా పర్సంటేజ్ షేర్ కావాలంటూ ఎగ్జిబిటర్లు గట్టిగా పట్టుబడుతున్నారు. సాధారణంగా పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో రెంట్ విధానంపై చర్చలు జరుగుతుంటాయి, కానీ ఈసారి ఎగ్జిబిటర్లు మాత్రం కాస్త తక్కువ పర్సెంట్ ఇచ్చినా సరే, కానీ కచ్చితంగా పర్సంటేజ్ రూపంలోనే డీల్ ఉండాలని వారి డిమాండ్ . దీనికి సమాధానంగా నిర్మాతల వైపు నుండి కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. ఫిక్స్డ్ రెంట్‌తో పాటు అదనంగా 7.5 పర్సెంట్ వరకు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నిర్మాతలు ఈ సమావేశంలో స్పష్టం చేశారని సమాచారం. అయితే వివాదం అంతటితో ముగిసిపోలేదండోయ్ .
నెక్స్ట్ సినిమాలకు సంబంధించి పర్సెంటేజ్ ఎంత
కేవలం ఈ ఒక్క సినిమాతోనే సమస్యను వదిలేయకుండా, ఫ్యూచర్లో రాబోయే నెక్స్ట్ సినిమాలకు సంబంధించి పర్సెంటేజ్ ఎంత ఇస్తారు అనే దానిపై ‘పెద్ది’ రిలీజ్‌కు ముందే తమకు లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడంతో చర్చలు కాస్తా సంక్లిష్టంగా మారాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని కోరిన నిర్మాతలు, తమ ఫైనల్ డెసిషన్‌ను రేపు వెల్లడిస్తామని చెప్పినట్టు తెలుస్తుంది.
also read :నాదగ్గర రూపాయి కూడా లేదు..రూ.100 కోట్ల ఆస్తి మొత్తం ఆమెకే రాసేశా.. పోసాని సంచలన వ్యాఖ్యలు
ఇక ఈ గందరగోళం మధ్యే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ‘పెద్ది’ సినిమా వరకు పెరిగిన టికెట్ రేట్లలో 7.5 శాతం ఎగ్జిబిటర్లకు ఇచ్చే విధంగా, అలాగే ప్రీమియర్ షోల విషయానికి వస్తే 25,000 రూపాయల రెంట్ చెల్లించేలా చాంబర్ ఒక సరికొత్త ఫార్ములాను ప్రతిపాదించింది. టాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ప్రస్తుతానికి ఈ నిర్ణయానికి ఒకే చెప్పడం విశేషం. ఈ అంగీకారంతో ‘పెద్ది’ సినిమా విడుదలకు ఉన్న అతిపెద్ద అడ్డంకి ప్రస్తుతానికి తొలగిపోయినట్లేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
జూన్ మొదటి వారంలో రాబోతున్న ‘పెద్ది’
నిజానికి గత కొన్నాళ్లుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద థియేటర్ల రెంట్లు, షేర్ల పంపకాలపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ సమ్మర్ సీజన్‌లో ఇప్పటికే పలు పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. బాక్సాఫీస్ రేసులో నిలిచిన భారీ చిత్రాల కలెక్షన్ల విషయంలోనూ, ఓవర్సీస్ అండ్ నార్త్ ఇండియా బిజినెస్ పోటీలోనూ ఇండస్ట్రీ సరికొత్త సవాళ్లను ఫేస్ చేస్తుంది . ఇలాంటి టైంలో జూన్ మొదటి వారంలో రాబోతున్న ‘పెద్ది’ సినిమా ఇటు ఎగ్జిబిటర్లకు, అటు నిర్మాతలకు ప్రెస్టేజియస్ గా మారింది.
ప్రమోషన్స్ పరంగా, ప్రెస్ మీట్లతో ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. ఇలాంటి క్రేజీ మూవీ రిలీజ్ టైంలో థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య వివాదం నడవడం ఇండస్ట్రీకి పెద్ద దెబ్బే. మొత్తం మీద ఈరోజు జరిగిన చర్చలని బట్టి చూస్తే, ఈ ఇష్యూ రేపటితో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.చూడాలి మరి రేపు నిర్మాతలు ఎలాంటి డిసీషన్ తీసుకుంటారో, అది పెద్ది పై ఎలా ఎఫెక్ట్ చూపెట్టనుందో !
also read :లోకేశ్‌తోనే మొదలుపెడదాం…చంద్రబాబు ‘పాపులేషన్’ కామెంట్స్‌పై పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్