E-Paper
Advertisement

Anand deverakonda: అన్న బాటలోనే విజయ్ తమ్ముడు.. కోడలిగా మరో హీరోయిన్!

Anand deverakonda: అన్న బాటలోనే విజయ్ తమ్ముడు.. కోడలిగా మరో హీరోయిన్!
Advertisement

Anand deverakonda:తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సెలబ్రిటీ జంట రష్మిక మందన్న (Rashmika mandanna) , విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నేడు పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సొంతం చేసుకొని.. క్రేజీ జంటగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత ప్రేమలో పడ్డ ఈ జంట.. ఎనిమిది సంవత్సరాల పాటు రహస్యంగా తమ బంధాన్ని కొనసాగించారు. ఇక ఎట్టకేలకు అభిమానులు ప్రేమగా పెట్టుకున్న “విరోష్” అనే పదాన్ని స్వీకరిస్తూ ..”ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అంటూ ఫిబ్రవరి 26 2026న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇకపోతే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అటు లవ్ విషయంలోనే కాదు ఇటు పెళ్లి విషయంలో కూడా ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో నిలిచిన విషయం తెలిసిందే.

దేవరకొండ కుటుంబంలోకి మరో హీరోయిన్..

ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి తర్వాత ఆనంద్ దేవరకొండ పెళ్లి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది . దీనికి కారణం విజయ్ దేవరకొండ తన సొంత గ్రామమైన తుమ్మన్ పేటలో తన తమ్ముడి పెళ్లి చేస్తానని చెప్పారో లేదో అప్పుడే మరో హీరోయిన్ తో ఆనంద్ దేవరకొండ కలిసి దిగిన ఫోటో హల్చల్ చేస్తోంది. .పైగా వీరిద్దరూ ఇండస్ట్రీకి చెందిన వారే కావడం గమనార్హం. ఈ ఫోటోలను బట్టి చూస్తే ఆనంద్ దేవరకొండ కాబోయే భార్య ఈమె.. దేవరకొండ కుటుంబానికి మరో హీరోయిన్ కోడలిగా అడుగుపెట్టబోతోంది అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు.

విరోష్ వెడ్డింగ్ నుండి ఫోటో వైరల్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వేడుకలకు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటతో పాటు ఆనంద్ దేవరకొండ , తెలుగు బ్యూటీ వైష్ణవి చైతన్య కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ మధ్య రిలేషన్షిప్ మొదలైందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో .. దీనికి తోడు రీసెంట్గా జరిగిన విజయ్, రష్మిక పెళ్లి వేడుకల్లో సందీప్ రెడ్డి ప్రముఖులతో పాటు వైష్ణవి కూడా కనిపించడం రూమర్స్ కి మరింత ఆజ్యం పోసింది.

ALSO READ:Varalakshmi Sarathkumar: రాజకీయాలపై వరలక్ష్మి ఆసక్తి.. తెలుగు , తమిళ్ రాష్ట్రాల నుండి పోటీ!

ఇన్ డైరెక్ట్ గా రిలేషన్ కన్ఫామ్ చేసిన వైష్ణవి చైతన్య..

Advertisement

ఇక అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఒక అభిమాని “తర్వాత మీ పెళ్లి కదా?” అని చేసిన కామెంట్ కి వైష్ణవి చైతన్య లైక్ కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది . మా పెళ్లి కూడా త్వరలో అనే ఇండికేషన్ ఇచ్చినట్టు ఉంది కదూ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ రిలేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై ఈ జంట క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇకపోతే ఈ ఫోటోలు చూసిన కొంతమంది ఇది ఏఐ క్రియేటెడ్ అంటున్నారు. మరి దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×