E-Paper
Advertisement

Horror movie OTT : వెన్నులో వణుకు పుట్టించే బామ్మ ఆత్మ… నెల రోజుల తర్వాత ఓటీటీలోకి తమిళ హారర్ థ్రిల్లర్

Horror movie OTT : వెన్నులో వణుకు పుట్టించే బామ్మ ఆత్మ… నెల రోజుల తర్వాత ఓటీటీలోకి తమిళ హారర్ థ్రిల్లర్
Advertisement

Horror movie OTT : ఓటీటీలో హారర్ సినిమాల సందడి ఎక్కువగానే ఉంది. ఈ సినిమాలను ప్రేక్షకులు చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఇలాంటి కథలను తీసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఇక ఈ నేపథ్యంలో ఓటీటీలో కి ఒక తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఇది థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత డిజిటల్ ఆడియన్స్ ను పలకరించబోతోంది. ఒక పురాతన బంగ్లా చుట్టూ తిరిగే ఈ కథ ఒక ముసలి ప్రేతాత్మ చుట్టూ తిరుగుతుంది. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమా హారర్ సీన్స్ తో పాటు, ఎమోషన్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ తమిళ హారర్ మూవీ పేరు గ్రానీ (Granny). జనవరి 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, మార్చి 6 నుంచి ఆహా తమిళం ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. దీనికి దీనికి ఐఎండీబీలో 7.8 రేటింగ్ ఉండటం విశేషం. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను విజీ చంద్రశేఖర్ పోషించింది. ఈ తమిళ హారర్ థ్రిల్లర్ సినిమాకు విజయా కుమార దర్శకత్వం వహించారు. ధిలీపన్, సింగంపులి, గజ రాజా, అనంతు నాగ్ మిగతా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంలో టెక్నికల్ అంశాలు కూడా కీ రోల్ అయ్యాయి. సౌండ్ ఎఫ్ఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, బంగ్లా చుట్టూ తిరిగే సంఘటనలు ఈ సినిమా విజయ పథంలో నడిపించాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక టెక్కీ దంపతులు తమ పూర్వీకుల ఇంటికి తిరిగి రావడంతో ఈ కథ మొదలవుతుంది. అది లంకంత కొంపలా ఉంటుంది. వీళ్ళు వచ్చీరాగానే ఆ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. అక్కడ ఎప్పటినుంచో ఒక ముసలామె ఆత్మ తిరుగుతుంటుంది. అక్కడ దెయ్యం ఉందనే సంగతి తెలియక వాళ్ళు అక్కడికి వస్తారు. ఇప్పుడు ఆ జంట, ఈ దెయ్యం బారిన పడి ఇబ్బందుల్లో పడతారు. ఒక పక్క ఈ ఆత్మ ప్రతీకారం కోసం వేచి చూస్తుంటుంది. ఇక స్టోరీ నడిచే కొద్దీ, అసలు ఆ పాత బంగళాలలో ఉన్న ఆత్మ ఎవరు? ఎవరి కోసం ఎదురుచూస్తోంది? ప్రతీకారం ఎవరిమీద ? అనే ప్రశ్నలతో ఈ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

Read Also : తండ్రి ఆశయం కోసం ఓ కూతురు పోరాటం… ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి అనుపమ్ ఖేర్ మూవీ

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×