E-Paper
Advertisement

కేసులో బిగ్ ట్విస్ట్.. సీఎంకి లేఖ రాసిన మోనాలిసా?

కేసులో బిగ్ ట్విస్ట్.. సీఎంకి లేఖ రాసిన మోనాలిసా?
Advertisement

Monalisa:మహా కుంభమేళాలో పూసలమ్ముతూ ఒక్కసారిగా వైరల్ అయిన పూసల సుందరి మోనాలిసా గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తేనె కళ్ళతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ చిన్నది. ఒక ఫోటోతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.. దీంతో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా స్వయంగా ఆమె తల్లిదండ్రులను కలిసి.. ఆమెను నటనా రంగంలోకి తీసుకొచ్చారు. అలా ఒక వీడియో ఆల్బమ్ సాంగ్ లో సందడి చేసిన ఈమె.. తెలుగులో ఒక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు చెన్నై , కేరళ వంటి ప్రాంతాలలో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె అనూహ్యంగా తన ప్రియుడితో పెళ్లికి తన కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు అంటూ కేరళ పోలీస్ స్టేషన్లో దర్శనమిచ్చింది. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది రాజకీయ ప్రముఖుల సమక్షంలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను మోనాలిసా మార్చి 11న తిరువనంతపురం సమీపంలో ఉన్న ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు.

సీఎంకి లేఖ రాసిన మోనాలిసా..

ఇకపోతే భారతీయ గిరిజన కమిషన్ విచారణలో వివాహ సమయంలో మోనాలిసా మైనర్ అని తేలడంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఈమె భర్తపై పోక్సో కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. సడన్గా మొన్నటికి మొన్న మోనాలిసా మిస్ అయింది అంటూ ఈమె భర్త వీడియోతో సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు తాజాగా మోనాలిసా తనకు రక్షణ కావాలంటూ సీఎం కి లేఖ రాసి అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దయచేసి రక్షించండి అంటూ విన్నపం..

Advertisement

తన భర్తతో కలిసి కేరళలో ఉంటున్న ఈమె తనను మధ్యప్రదేశ్ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మోనాలిసా రాసిన లేఖలో ఏముంది అనే విషయానికి వస్తే.. “నేను 18 సంవత్సరాల నిండిన మేజర్ ని.. నా ఇష్టపూర్వకమే ఈ వివాహం జరిగింది. అయితే మధ్యప్రదేశ్ పోలీసులు మాత్రం నన్ను బలవంతంగా నా సొంతూరికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నాకు రక్షణ కల్పించండి” అంటూ సీఎం విజయన్ తో పాటు కొచ్చి పోలీస్ కమిషనర్ ని కూడా కోరింది. ఏది ఏమైనా మొన్నటి వరకు మిస్సింగ్ కేసులో ఉన్న మోనాలిసా సడన్గా ప్రత్యక్షమై కేరళ సీఎం కి లేఖ రాయడం ఏంటో అర్థం కావడం లేదు అంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

ALSO READ:హీరో విజయ్ దళపతికి తప్పిన ప్రమాదం!

మైనర్ అయినప్పటికీ మేజర్ అంటున్న మోనాలిసా..

Advertisement

ఇదిలా ఉండగా మైనర్ ను వివాహం చేసుకున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్ ఖాన్ ను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేరళ హైకోర్టు నుంచి ఫర్మాన్ ఖాన్ మే 20 వరకు అరెస్టు కాకుండా ముందస్తు స్టే కూడా పొందారు. మరొకవైపు మోనాలిసా తల్లి లతా భోస్లే తన కుమార్తె 2009లో డిసెంబర్లో జన్మించిందని, వివాహం నాటికి తాను ఇంకా మైనర్ అని వాదిస్తోంది . ఇక సినిమా అవకాశాల ఆశ చూపి తన కుమార్తెను ప్రలోభ పెట్టి తీసుకెళ్లారని ఆమె ఆరోపిస్తోంది. పెళ్లి కోసం నకిలీ బర్త్ సర్టిఫికెట్ ను సృష్టించారని , కమిషన్ ప్రాథమిక దర్యాప్తులో ఇదే విషయం వెళ్లడైందని తెలిపారు. ఇక మధ్యప్రదేశ్ లోని ఆసుపత్రిల రికార్డుల ప్రకారం కూడా వివాహం సమయంలో మోనాలిసా వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని తెలిసి కోర్టు కేసుని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇప్పుడు సీఎం కి లేఖ రాసింది. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×