E-Paper
Advertisement

Kanguva : కంగువ ను గర్తు చేసుకుంటున్న తమిళ తంబీలు… ఈ లాజిక్స్‌తో ఫుల్‌గా ట్రోల్స్  

Kanguva : కంగువ ను గర్తు చేసుకుంటున్న తమిళ తంబీలు… ఈ లాజిక్స్‌తో ఫుల్‌గా ట్రోల్స్  
Advertisement

Kanguva : కొన్ని సినిమాలను కొంతమంది దర్శక నిర్మాతలు విపరీతంగా నమ్ముతూ ఉంటారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా వర్కౌట్ అవుతుంది అని చాలా ప్రచారం కూడా చేస్తారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ సినిమా రిజల్ట్ కొన్నిసార్లు ఆడియన్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది. ఇలా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి సినిమా ఎంతటి ప్రభావాన్ని చూపించిందో అందరికీ తెలిసిన విషయమే. బాహుబలి సినిమా అనేది తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. తెలుగు సినిమాకి ఒక రకమైన గౌరవాన్ని తీసుకొచ్చిన సినిమా బాహుబలి. బాహుబలి సినిమా చూశాను తర్వాత మిగతా ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు కూడా బాహుబలి స్థాయి సినిమా చెయ్యాలి అని ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ కలలు సాకారం కాలేదు. మణిరత్నం లాంటి దర్శకులు కూడా ఆ ప్రయత్నాన్ని చేశారు. అది కొంతమేరకు మాత్రమే వర్కౌట్ అయింది.

మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటున్న కంగువ 

Advertisement

కంగువ సినిమా విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పిన మాటలు అంత ఈజీగా మర్చిపోలేము. ఒక రేంజ్ లో ఆ సినిమాకి ఎలివేషన్ ఇచ్చారు. ఇది కోలీవుడ్ సినిమా పరిశ్రమ కి ఒక బాహుబలి లాంటి సినిమా అని చెప్పాడు జ్ఞానువేల్ రాజా.

మరోవైపు ఈ సినిమాకి 1000 కోట్లు వస్తుందా అని ఇంటర్వ్యూస్ లో యాంకర్ అడిగితే, మీరు 1000కోట్లు అంటున్నారేంటి మాకు చాలా డిసప్పాయింట్ గా ఉంది మేము రెండు వేల కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటూ చెప్పాడు జ్ఞానువేల్ రాజా. కానీ సినిమా ఫస్ట్ షో పడగానే టాక్ తేడా వచ్చేసింది.

ఈ లాజిక్ తో ట్రోల్స్ 

Advertisement

ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ జరిగినప్పుడు నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ… మీరు ఏ పాసెస్ అయితే పట్టుకొని ఈవెంట్ కి వచ్చారో ఈ ప్రాసెస్ ని చాలా జాగ్రత్తగా దాచుకోండి. మళ్లీ సక్సెస్ మీట్ ఈ సినిమాకి సంబంధించి ఇక్కడే నిర్వహిస్తాము అప్పుడు ఇవే పాసెస్ పట్టుకొని రండి అని చెప్పాడు.

ఈ మాటలను సీరియస్ గా తీసుకున్న అభిమానులు ఇప్పటికీ కూడా ట్విట్టర్ వేదికగా జ్ఞానవేల్ రాజాను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రాసెస్ ఇంకా ఇప్పటికీ కూడా పదిలంగానే ఉన్నాయి సక్సెస్ ఈవెంట్ ఎప్పుడు పెడతారు అని ట్విట్టర్లో ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు వాళ్లు ట్రోల్ చేయడానికి అసలైన కారణం ఏంటి అంటే, కంగువ సినిమా విడుదలై నేటికీ సంవత్సరం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వీడియో కంటెంట్ వైరల్ స్పీచ్ లు ఇప్పుడు మరోసారి అందరికీ తారస పడుతున్నాయి.

Also Read: Sangeeth Shoban : నిఖిల్ దర్శకుడు తో సంతోష్ శోభన్.. మరి సుకుమార్ ఇన్వాల్వ్ అవుతారా?

Related News

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

Big Stories

Advertisement
×