E-Paper
Advertisement

Sai Dharam Tej : అసలు ఆ సినిమాని లెక్క చేయడం లేదు, ఎన్టీఆర్ మాదిరిగానే సాయితేజ్

Sai Dharam Tej : అసలు ఆ సినిమాని లెక్క చేయడం లేదు, ఎన్టీఆర్ మాదిరిగానే సాయితేజ్
Advertisement

Sai Dharam Tej : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోల కెరియర్ లో కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ ఉంటాయి. వాళ్లు కథను ఎంచుకునే విధానం, లేదంటే కథ బాగా చెప్పిన తర్వాత దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కించిన విధానం దీనివలన ఎందుకో కొన్ని సందర్భాల్లో సినిమా ఫెయిల్ అవుతూ ఉంటుంది. అది ఎంత ఫెయిల్ అవుతుంది అంటే ఆ సినిమా గురించి ప్రస్తావించడానికి కూడా కొన్నిసార్లు హీరోలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కంప్లీట్ గా ఆ సినిమాలను మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఉన్న మెగా హీరోస్ లో సాయి ధరం తేజ్ ఒకరు. సాయి తేజ్ కెరియర్లో హిట్ సినిమాలు కంటే కూడా డిజాస్టర్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. సాయి కథలను ఎంచుకునే విధానం అంత పర్ఫెక్ట్ గా ఉండదు అనడానికి ఉదాహరణలే ఆ సినిమాలు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సాయితేజ్ సినిమాలు చేస్తున్నారు. నేటికీ ఇండస్ట్రీకి వచ్చి సాయి తేజ్ ఏకంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

ఆ సినిమాను లెక్క చేయడం లేదు 

Advertisement

సాయి తేజ్ గురించి అవగాహన ఉన్న ఎవరైనా అతని మొదటి సినిమా ఏంటి అని అడిగితే ఆలోచించకుండా చెప్పే పేరు రేయ్. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి. ఈ సినిమాకి మంచి హైప్ రావడానికి కూడా కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కంప్లీట్ డిజాస్టర్ గా మారిపోయింది. ఆ తర్వాత రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం మంచి సక్సెస్ అయింది. 11 సంవత్సరాల క్రితం ఆ సినిమా ఇదే రోజున విడుదలైంది. అందుకే సాయి తేజ్ ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 11 సంవత్సరాలు అయింది అనే పోస్ట్ షేర్ చేశారు. కానీ దీనికంటే ముందు విడుదలైన సినిమా రేయ్. అంటే ఆ సినిమాను సాయితేజ్ కంప్లీట్ గా మర్చిపోయారు.

Advertisement

ఎన్టీఆర్ మాదిరిగానే

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు సాధించుకున్న హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు తారక్. తారక్ ఫస్ట్ సినిమా ఏంటి అంటే అందరూ ఆలోచించకుండా చెప్పేది స్టూడెంట్ నెంబర్ వన్ అని, కానీ తారక్ దానికంటే ముందు హీరోగా నిన్ను చూడాలని అనే ఒక సినిమా చేశాడు.

నిన్ను చూడాలని సినిమా ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అసలు సక్సెస్ కాలేదు. దాదాపు ఎన్టీఆర్ కూడా ఆ సినిమాను మర్చిపోవలసిన పరిస్థితి. ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాను ఎలా అయితే మర్చిపోయాడో, ఇప్పుడు సాయి తేజ్ కూడా తను చేసిన రేయ్ సినిమాను మర్చిపోయాడు అని చెప్పాలి.

Also Read: Chaitanya Jonnalagadda: విలన్ గా ఆ అరాచకం ఏంటయ్యా, టిల్లు అన్నయ్య విలనిజం

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×