Jabardasth Satyasri:జబర్దస్త్ …తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా నవ్వులు పండించిన క్రేజీ కామెడీ షో.ఇక ఈ షో లో చమ్మక్ చంద్ర టీమ్ ఏరేంజ్ లో రచ్చ చేస్తుందో ఈ షో చూసేవారికి బాగా తెలుసు.ఇక ఇందులో జబర్దస్త్ సత్యశ్రీ గా పేరొందిన సత్యశ్రీ చమ్మక్ చంద్ర టీమ్ లో మేజర్ కంటెస్టెంట్ అన్న సంగతి తెల్సిందే.అయితే ఈ షో గురించి తాజాగా కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చింది నటి సత్యశ్రీ.
అంతా స్క్రిప్ట్ లో ఉన్నట్టుగానే
ఇందులో మీకు కనిపించే డైలాగులు ఏవీ స్పాంటేనియస్ గా అప్పుడప్పుడు అనుకొని చెప్పినవి కాదని,స్టేజ్ పై చెప్పిన ప్రతీ డైలాగ్ ని రిహార్సల్స్ లో బాగా నేర్చుకొనే చెబుతామని, షోలో ఇచ్చే ప్రతీ ఎక్స్ప్రెషన్ కూడా అంతా స్క్రిప్ట్ లో ఉన్నట్టుగానే ఇవ్వాల్సి ఉంటుందని అసలు విషయం చెప్పుకొచ్చింది.
పేపర్ మీద ఉన్న డైలాగ్స్ కాకుండా సొంతంగా డైలాగ్స్ చెబితే కుదరదని,అలా గనుక ఇష్టమోచ్చినట్టుగా డైలాగ్ ని వెనకా ముందు చేసి చెబితే తర్వాతి స్కిట్ లో ఉండమని చెప్పి ఆశ్చర్యపరిచింది సత్యశ్రీ.నేను వెళ్ళొస్తా అనే డైలాగ్ ఉంటె తెలంగాణా వారైనా సరే నేను వెళ్ళొస్తా అనే చెప్పాలని,అలాకాకుండా నేను పోతా అని సొంత యాసలో నచ్చినట్టుగా చెబితే ఇక అంతే సంగతులు అని తెలిపింది.
చమ్మక్ చంద్ర అలా కష్టపడి చేసినందుకే
ఇక డైలాగ్ ని కూడా ముందు వెనకా లాంటివి చేయకూడదని, ఉదాహరణకి ఎందుకు నా మీద అరుస్తున్నావ్ అనే డైలాగ్ ని నా మీద ఎందుకు అరుస్తున్నావ్ అని కాస్త మార్చి చెప్పినా చమ్మక్ చంద్ర అస్సలు ఒప్పుకునేవాడు కాదని, స్క్రిప్ట్ లో ఉన్న డైలాగులని యాజ్ టీజ్ దించేయాలని నిజాలు వెల్లడించింది.
ఇక స్కిట్ ని ఎన్ని రోజులు రిహార్సల్ చేస్తారు అన్న ప్రశ్నకి సమాధానంగా కేవలం ఒక్క రోజు మాత్రమే పర్ ఫెక్ట్ గా చేస్తామని, చమ్మక్ చంద్ర అలా కష్టపడి చేసినందుకే,తను అంతగా శ్రద్ధ తీసుకుని చేశాడు కాబట్టే ఇలా మంచి మంచి స్కిట్స్ మీ ముందు ఉన్నాయని తెలిపింది సత్యశ్రీ.
విక్రమ్ వన్ రాకెట్ సక్సెస్ వెనకాల చెల్లి కీర్తి శ్రీ
నిజానికి బుల్లి తెరపై కనిపిస్తున్న నవ్వుల కష్టం వెనుక టీమ్ లీడర్స్ ఎంతలా కష్టపడతారో,మనకి నవ్వులు అందించడానికి వారు ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెడతారో సత్యశ్రీ చెప్పిన మాటల ద్వారా అర్థమయింది.మొత్తానికి సత్యశ్రీ ఇలా ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు ఇపుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతున్నాయి.ఇక తాజాగా విక్రమ్ వన్ రాకెట్ సక్సెస్ వెనకాల తన చెల్లి కీర్తి శ్రీ ఉందని ఇంస్టాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే.