E-Paper
Advertisement

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!
Advertisement

Keerthi Sri: సత్యశ్రీ’…’జబర్దస్త్’ వంటి క్రేజీ ఎంటర్ టైనింగ్ ప్రోగ్రాం తో ఆడియన్స్ ని అలరించి ‘జబర్దస్త్’ సత్యశ్రీ గా పేరు తెచ్చుకున్న కుటుంబంలో ఇపుడు సంతోషంతో నిండిపోయింది.కారణం భారత్ గర్వించదగ్గ ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘విక్రమ్-1′ (మిషన్ ఆగమన్) రాకెట్ ప్రయోగంలో సత్యశ్రీ సొంత చెల్లెలు, కీర్తి శ్రీ అత్యంత కీలకమైన పాత్రను పోషించడమే దీనికి కారణం.

అవును ..’జబర్దస్త్’ సత్యశ్రీ చెల్లి కీర్తి శ్రీ విక్రమ్-1 ప్రాజెక్ట్‌లో ఉద్యోగిగా పని చేస్తుంది.అంతే కాదు రాకెట్ ప్రయోగానికి మూలమైన ‘ఏవియానిక్స్, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఇంజనీర్’గా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుంది. కౌంట్ డౌన్ కి ముందు జరిగే ముఖ్యమైన ఎలక్ట్రికల్ వోల్టేజ్ పరీక్షలు, సిగ్నల్ కమ్యూనికేషన్స్, సిస్టమ్ అలైన్‌మెంట్‌ లో కీర్తి అందించిన టెక్నాలజీనే ఈ మిషన్ సక్సెస్ అవడంలో కీలకపాత్ర పోషించింది.

Advertisement

also read:రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

ఇక దీనికి ‘మిషన్ ఆగమన్’ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లే ముందు కీర్తి శ్రీ సంతకం చేసిన ఫోటోలు లాగే కీర్తి అంతరిక్ష కేంద్రంలో ఆమె పనిచేస్తున్న ల్యాబ్ ఫోటోలను అక్క సత్యశ్రీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

“ఈ రోజు నేను ఒక యంత్రాన్ని మాత్రమే చూడటం లేదు… నా చెల్లి కన్న కలలు నింగిలోకి ఎగరడాన్ని చూస్తున్నాను. చిన్నప్పుడు ఆకాశంలోని నక్షత్రాలను ఆశ్చర్యంగా చూసిన నా చెల్లి, ఈ రోజు అదే నక్షత్రాల వైపు ప్రయాణించే మార్గాన్ని డిజైన్ చేసే స్థాయికి ఎదిగింది. ఒక అక్కగా ఈ దృశ్యాన్ని చూస్తుంటే నా హృదయం వర్ణించలేని గర్వంతో నిండిపోతోంది” అంటూ సత్యశ్రీ తన చెల్లి పట్ల ఎమోషనల్ గా పెట్టిన పోస్ట్ అందరిని కదిలిస్తుంది.

ఇక ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళ విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకుకి చెందిన వీరిలో సత్యశ్రీ నటన పై ఇష్టంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.అలా ‘జబర్దస్త్’ షోలో చమ్మక్ చంద్ర కాంబినేషన్‌లో కామెడీ స్కిట్లు వేసి మంచి పేరు తెచ్చుకోగా, ఇపుడు కీర్తి శ్రీ ఇలా స్పేస్ రాకెట్ ఇంజనీర్ గా సత్తా చాటడం విశేషం.ఇక కీర్తి శ్రీ ఇలా ఇండియా గర్వ పడే విధంగా విక్రమ్-1 ప్రాజెక్ట్‌లో తనదైన పాత్ర పోషించడంతో ఏంటో మంది సినీ ప్రముఖులు తమ విషెస్ తెలియపరుస్తున్నారు కూడా !

also read:‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×