E-Paper
Advertisement

ఆ 3 సెకన్ల సీన్ కొంపముంచింది…..వివాదంలో జాక్వెలిన్ కొత్త మ్యూజిక్ వీడియో!

ఆ 3 సెకన్ల సీన్ కొంపముంచింది…..వివాదంలో జాక్వెలిన్ కొత్త మ్యూజిక్ వీడియో!
Advertisement

Jugni Controversy: ఇదసలే  సోషల్ మీడియా జమానా ..చిన్న నిప్పు రవ్వ చాలు మొత్తం తగలెట్టడానికి .ఈ టాపిక్ ఎందుకంటారా..జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తాజాగా “జుగ్ని” అంటూ ఒక మ్యూజిక్ వీడియో వదిలింది.ఇక బి ప్రాక్, సోను తుక్రాల్ పాడిన ఈ పాట రిలీజ్ అయిన రెండు రోజులలోనే (48 గంటల్లోనే)ఏకంగా 1.4 కోట్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్ ని షేక్ చేసింది కూడా.అంత వరకు భాగానే ఉంది.కానీ ఆ పాటే ఇపుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతుంది.

అసలు ఎడిటర్ సాంగ్ ఎడిట్ చేస్తూ నిద్ర పోయాడా

Advertisement

ఈ పాటలో బోల్డ్ అవుట్‌ఫిట్ వేసుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక షాట్ లో ఎక్స్పోజింగ్ చేసిందన్నది నెటిజన్ల వాదన. ఎక్స్పోజింగ్ అంతా చేస్తున్నారు దాంట్లో ఏముందనేనా …ఇందులో ఆ బార్డర్స్ మరింత శ్రుతి మించింది మరి.అసలు ఎడిటర్ సాంగ్ ఎడిట్ చేస్తూ నిద్ర పోయాడా అంటూ సోషల్ మీడియా జనాలు ఎకిపారేస్తుండటం,అలా ఆ వివాదం కాస్తా అటు తిరిగి ఇటు తిరిగి మేకర్స్ చెవిన పడటంతో వెంటనే రియాక్ట్ అయి ఆ సీన్ ని బ్లర్ చేసేసింది.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.అసలేమాత్రం లేట్ చేయకుండా ఆ క్లిప్పింగ్స్‌ను స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేసేశారు నెటిజన్లు.

బట్టలు తక్కువైపోతున్నాయంటూ జరిగిన గొడవలెన్నో

Advertisement

గతంలో కూడా పాటల్లో బట్టలు తక్కువైపోతున్నాయంటూ జరిగిన గొడవలెన్నో. ఆ మధ్య వచ్చిన”పఠాన్” సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపికా పదుకొణె ధరించిన కాస్ట్యూమ్స్ రంగులపై, డిజైన్‌పై దేశవ్యాప్తంగా పెద్ద రచ్చే జరిగింది.ఇక తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్”జుగ్ని”విషయం లోనూ ఇదే రిపీట్ అయింది.అయితే ఈసారి అంతకు మించి ఇది పాట కాదు ఇదో పోర్న్ కంటెంట్ అంటూ కానీ దానికి ఎంటర్ టైన్ మెంట్ అంటూ కలరింగ్ ఇస్తున్నారంటూ చెడుగుడు ఆడేస్తున్నారంతా.

ఈ “జుగ్ని”ఎప్పుడు చల్లారుతుందో !

ఐతే ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తప్పేమీ లేదని డైరెక్టర్ ఏది చెబితే అదే ఫాలో అవుతుందని మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు.ఇక ఈ పాట పాడిన బి ప్రాక్ గతంలో ‘తేరి మిట్టి’ అంటూ మంచి మంచి దేశభక్తి టలు పాడాడని, అలాంటిది ఇలా వివాదాలకి కారణమయ్యే బూతు పాటలు పాడడం ఏంటో అంటూ బాధపడిపోతున్నారు.అసలు బి ప్రాక్ గళం నుండి ఇలాంటి పాటని అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదని వాపోయారు,సినిమాలకి అయితే సెన్సార్ ఉందని, ఇక నుండి యూ ట్యూబ్ కి కూడా అలాంటి నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

చూడాలి మరి నెట్టింట్లోఅగ్నిని రాజేస్తున్న ఈ “జుగ్ని”ఎప్పుడు చల్లారుతుందో !

Related News

లారెన్స్ సరసన సాయి పల్లవి, జాన్వీ? .. 30వ సినిమాలో ఆ నలుగురు భామల హంగామా!

సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా గళమెత్తిన కిరణ్ రావు…ఎమోషనల్ పోస్ట్ వైరల్ !

మౌనీరాయ్ తో డేటింగ్.. అసలు నిజం బయటపెట్టిన అర్జున్!

దిల్ రాజు పంచాయితీ వర్కవుట్ కాలేదా? డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ముదురుతున్న రచ్చ!

గణిత మేధావి రామానుజన్‌కు ప్రీతి ముకుందన్ ఏమవుతుందో తెలుసా ?

ఒక్క హిట్ పడితే రేట్లు ఆకాశానికి.. ‘జైలర్ 2’ బేరసారాలపై ఇండస్ట్రీలో సెటైర్లు!

ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? జబర్దస్త్ రష్మి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×