Spanish Romantic Series: మనసుకు బాగా దగ్గరైన వాళ్ళు చనిపోతే ఆ లోటు ఎవ్వరూ పూడ్చలేరు. అందులో నుంచి కోలుకోవడానికి ఈ జీవితం సరిపోకపోవచ్చు. కోల్పోయిన వారి గుర్తులు మనల్ని చాలా కాలం వెంటాడతాయి. వాళ్ళు మిగిల్చిన ఆ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలో అర్థం కాదు. మళ్లీ జీవితాన్ని ఎలా ప్రారంభించాలో తెలియక సతమతం అవుతుంటారు. అలాంటి ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథనే అందంగా చెప్పిన స్పానిష్ రొమాంటిక్ డ్రామా సిరీస్ ‘ది మ్యాప్ ఆఫ్ లాంగింగ్’ (The Map of Longing). మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
గ్రెటా అనే అమ్మాయి ఇందులో మన హీరోయిన్ పేరు. తన జన్మే ఒక ప్రత్యేక కారణం కోసం అనుకుంటుంది. ఎందుకంటే తన అక్క లూసీ ల్యుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది. ఆమెకు స్టెమ్ సెల్స్ చికిత్స కోసం గ్రెటాను ప్రత్యేకంగా ఈ ప్రపంచానికి తీసుకొస్తారు. ట్రీట్మెంట్ లో భాగంగా చెల్లి బ్లడ్ ను అక్కకు ఎక్కిస్తాడు. దాదాపు 20 సంవత్సరాలు ఇద్దరు సోదరీమణుల మధ్య ఉన్న ఆప్యాయత హార్ట్ టచింగ్ గా ఉంటుంది.
కానీ జీవితం ఎప్పుడూ అనుకున్నంత ఈజీగా ఉండదు కదా. ఎన్ని ప్రయత్నాలు చేసినా లూసీ క్యాన్సర్ తో మరణిస్తుంది. తన అక్కను కాపాడటమే జీవిత లక్ష్యంగా బతికిన గ్రెటా, ఆమె మరణంతో ఒక్కసారిగా ఒంటరిది అయిపోతుంది. అప్పటి నుంచి డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు, జీవితంపై విరక్తి ఆమెను చుట్టుముట్టేస్తాయి. లూసీ లేని లోకంలో ఎలా ముందుకు సాగాలో ఆమెకు తెలియదు.
ఇక్కడే కథలో టర్న్ వస్తుంది. చనిపోయే ముందు లూసీ తన సిస్టర్ గురించి ముందుగానే ఊహించి, ఆమె పరిస్థితిలో నుంచి బయట పడడానికి ఒక అద్భుతమైన గిఫ్ట్ ను పెట్టి పోతుంది. అదే ది మ్యాప్ ఆఫ్ లాంగింగ్. ఇది మామూలు బోర్డ్ గేమ్ కాదు, చేతితో తయారు చేసిన ఆట. గ్రెటా తన భయాలను అధిగమించి, మళ్లీ జీవితాన్ని ఆస్వాదించేలా లూసీ ఆ ఆటలో కొన్ని చాలెంజెస్ పెడుతుంది. ఆ ఆట ద్వారా గ్రెటాకు లూసీతో పరిచయం ఉన్న విల్ అనే సీక్రెట్ ఫ్రెండ్ పరిచయమవుతాడు. అసలు విల్ ఎవరు ? ఆ ఆట ఏంటి ? చివరికి గ్రెటా ఎలా మారింది ? అన్నది చూసి తెలుసుకోవలసిన కథ.
అలిస్ కెల్లెన్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా రూపొందిన లిమిటెడ్ సిరీస్ ఇది. జూలై 17న Netflixలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. స్పానిష్ తో పాటు ఇంగ్లీష్ ఆడియో, సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు. కావాలనుకుంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.
Read Also: మర్మమైన రీతిలో గ్రామస్తుల మరణాలు… దున్నపోతును బలిస్తేనే శాంతించే శాపం