E-Paper
Advertisement

‘పెద్ది’లో ‘అప్పలసూరి’ పాత్ర చరిత్రలో నిలిచిపోద్ది!.. అంతగా ఏముందంటే?

‘పెద్ది’లో ‘అప్పలసూరి’ పాత్ర చరిత్రలో నిలిచిపోద్ది!.. అంతగా ఏముందంటే?
Advertisement

Appalasuri Character: టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు సీనియర్ నటుడు జగపతి బాబు. ‘లెజెండ్’ చిత్రంతో సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ఇప్పటివరకు దాదాపు 90 క్యారెక్టర్ రోల్స్ చేశారు. అయితే వీటన్నింటిలోకి దర్శకుడు బుచ్చిబాబు సన – రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi) లో తాను పోషించిన ‘అప్పలసూరి’ పాత్ర అత్యంత ప్రత్యేకమైనదని జగపతి బాబు స్పష్టం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ పాత్రకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విశేషాలను ఆయన పంచుకున్నారు.

Read also-మరో హిట్‌ కోసం రెడీ అవుతున్న సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా లుక్!

Advertisement

‘పెద్ది’ సినిమాలో అప్పలసూరి క్యారెక్టర్ లుక్ చాలా భిన్నంగా ఉండబోతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ రషీద్ ఈ పాత్రకు మేకప్ డిజైన్ చేశారు. ఫస్ట్ డే ఆఫీస్‌లో స్క్రీన్ టెస్ట్ కోసం మేకప్ వేసి, కాస్ట్యూమ్ వేసుకోగానే.. తనను తాను అద్దంలో చూసుకుని ‘అప్పలసూరి’గా మారిపోయానని జగపతి బాబు చెప్పారు. స్క్రీన్‌పై చూసేటప్పుడు అసలు ఈ పాత్ర చేసింది జగపతి బాబేనా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఈ లుక్ ఉంటుందని, కేవలం గ్లామర్ కోసం కాకుండా కథ డిమాండ్ మేరకు ఈ గెటప్ డిజైన్ చేశారని తెలిపారు.

ఇది నెగిటివ్ క్యారెక్టర్ కాదు

ఈ పాత్ర గురించి వివరిస్తూ.. “అప్పలసూరి అనేది నెగిటివ్ క్యారెక్టర్ కాదు. అదొక డీప్ రూటెడ్ ఎమోషనల్ క్యారెక్టర్. ఒక బలమైన కాజ్ (లక్ష్యం) చుట్టూ తిరిగే పాత్ర. సినిమాకు ఇదొక పెద్ద పిల్లర్ లాంటిది. నా కెరీర్‌లో నేను చేసిన బెస్ట్ 6 పాత్రలలో (లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత) ఇది ఒకటిగా నిలిచిపోతుంది. బహుశా వాటన్నింటినీ మించినా ఆశ్చర్యపోనక్కర్లేదు” అని జగ్గుభాయ్ ధీమా వ్యక్తం చేశారు.

రామ్‌చరణ్‌తో ‘ఒరేయ్ అరేయ్’ అనే చనువు

Advertisement

సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ఉన్న బాండింగ్ చాలా క్యూట్‌గా ఉంటుందని జగపతి బాబు పేర్కొన్నారు. వయసులో, పాత్రలో చరణ్ కంటే చాలా పెద్దవాడైనప్పటికీ.. చరణ్‌ను ‘ఒరేయ్ అరేయ్’ అని పిలిచే చనువు ఈ పాత్రకు ఉంటుంది. ఇద్దరూ కలిసి బీడీలు పంచుకుని కాల్చే సీన్స్, వారి మధ్య వచ్చే ఎమోషన్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు. గతంలో ‘రంగస్థలం’లో చరణ్ పక్కన నెగిటివ్ షేడ్స్ లో నటించినా, అందులో లేని ఒక సరికొత్త హార్ట్ టచింగ్ కనెక్షన్ ఈ సినిమాలో చూడవచ్చని చెప్పారు.

Read also-వయసుపై ట్రోల్స్ చేసిన వారికి షమితా శెట్టి గట్టి కౌంటర్!.. ఇచ్చిపడేసిందిగా..

నరాలు బీసుకుపోయేలా చేసిన డబ్బింగ్!

ఈ సినిమా షూటింగ్ కేవలం 20 నుండి 25 రోజుల్లోనే పూర్తయినప్పటికీ, డబ్బింగ్ చెప్పడం మాత్రం జగపతి బాబుకు ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది. విజయనగరం యాస (విజయనగరం యాక్సెంట్)లో పర్ఫెక్షన్ రావడం కోసం, లోతైన ఎమోషన్ పండించడం కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. సాధారణంగా తన సినిమాలకు ఒకటి లేదా ఒకటిన్నర రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేసే జగపతి బాబు.. ‘పెద్ది’ సినిమాకు మాత్రం రోజుకు కేవలం రెండు, మూడు లైన్లు మాత్రమే చెప్పారు.

పర్ఫెక్షన్ కోసం డబ్బింగ్ రూమ్‌లో గొంతు చించుకుని లోపలి నుంచి అరవడం వల్ల, ఒకరోజు డబ్బింగ్ ముగిశాక మెడ, తల నరాలు టోటల్‌గా బీసుకుపోయి ఏకంగా 11 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని ఆనాటి కష్టాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో ‘పెద్ది’ సినిమా ఒక పెద్ద దిక్కుగా మారి, అందరికీ ఊపిరి పోస్తుందని జగపతి బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పలసూరిగా జగ్గుభాయ్ చేసిన విశ్వరూపాన్ని స్క్రీన్‌పై చూడటానికి మెగా అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×