E-Paper
Advertisement

వయసుపై ట్రోల్స్ చేసిన వారికి షమితా శెట్టి గట్టి కౌంటర్!.. ఇచ్చిపడేసిందిగా..

వయసుపై ట్రోల్స్ చేసిన వారికి షమితా శెట్టి గట్టి కౌంటర్!.. ఇచ్చిపడేసిందిగా..
Advertisement

Shamita Shetty Trolls: బాలీవుడ్ నటి షమితా శెట్టి వయసు 47 ఏళ్లు. ఆమె పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి తొందరపడటం లేదు. ఆమె సోదరి, ప్రముఖ నటి శిల్పా శెట్టి (50) కి అప్పటికే 14 ఏళ్ల కొడుకు ఉన్నప్పటికీ… కేవలం సమాజం కోసం లేదా పెళ్లి చేసుకోవాలి కాబట్టి తాను పెళ్లి చేసుకోనని షమితా ఎప్పుడూ చెబుతుంటుంది. తాజాగా ఆమె వయసును, పెళ్లి కాకుండా ఒంటరిగా ఉండటాన్ని అవహేళన చేస్తూ కామెంట్లు పెట్టిన నెటిజన్లకు షమితా శెట్టి గట్టి సమాధానం ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ట్రోలర్ చేసిన కామెంట్‌ల స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ఆమె ఒక సుదీర్ఘమైన నోట్‌ను రాసుకొచ్చింది.

Read also-ట్రోలర్లపై జగపతి బాబు సీరియస్.. రామ్‌చరణ్‌ గురించి చెబుతూ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్..

షమితా తన పోస్ట్‌లో ఏమందంటే?

Advertisement

“మీరు పెట్టిన అద్భుతమైన కామెంట్‌లకు స్పందించడానికి నేనీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను.
‘మీకు వయసైపోయింది, పూర్వపు అందం, మెరుపు ఇప్పుడు లేదు’ అని ఒకరు కామెంట్ చేశారు. అవును, నేను మునుపటిలా కనిపించను. కాలంతో పాటు మార్పులు వస్తాయి, ఇది ప్రకృతి నియమం. శారీరక రూపాంతరంతో సహా ఏదీ శాశ్వతం కాదు! కానీ, నా వయసుకు నేను ఆరోగ్యంగా, ఫిట్‌గా, సంతోషంగా ఉన్నాను. భగవంతుడు నాకు ఇచ్చిన ప్రతిదానికీ కృతజ్ఞతతో ఉన్నాను… నాకు కావాల్సింది కూడా అదే.”

మరొక నెటిజన్ పెట్టిన… ‘నువ్వు సరైన సమయానికి పెళ్లి చేసుకుని ఉంటే, నీ పిల్లలు ఈపాటికే పెద్దవాళ్లయిపోయేవారు’ అనే కామెంట్‌కు కూడా ఆమె తీవ్రంగా స్పందించింది. “అయితే ఏంటి? అవును, మీరు అందరికీ తెలిసిన విషయాన్నే చెప్పారు… ఐతే ఇప్పుడు ఏంటి? అసలు మీరు పెళ్లి చేసుకుని ఏం సాధించారని భయ్యా? అన్నిటికంటే ముఖ్యంగా, మాలాంటి ఒంటరి మహిళలను వయసు పేరుతో ఎగతాళి చేయడానికి, మీ పాతకాలపు పురుషాధిక్య ఆలోచనలను మాపై రుద్దడానికి మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతారు? దయచేసి నాకు ఒక చిన్న సాయం చేయండి, వెంటనే నన్ను అన్‌ఫాలో అయిపోండి!” అంటూ షమితా ఘాటుగా సమాధానమిచ్చింది.

Advertisement

Read also-Podarillu Today Episode : చక్రీ మాటకు ప్రతాప్ మైండ్ బ్లాక్.. మహా గదిలోకి చక్రీ.. కన్నతల్లి కోసం కన్నా కన్నీళ్లు.. ఇదే ట్విస్ట్

ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘మొహబ్బతేన్’ (2000) ద్వారా షమితా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘జెహర్’ (2005), ‘ఫరేబ్’ (2005), ‘క్యాష్’ (2007) వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్‌ రంగంపై ఆసక్తితో సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చింది. ఆ తర్వాత ‘ఝలక్ దిఖ్లా జా 9’, ‘ఖత్రోన్ కే ఖిలాడీ 9’, ‘బిగ్ బాస్ OTT’, ‘బిగ్ బాస్ 15’ వంటి రియాలిటీ షోల ద్వారా ఆమె మళ్లీ ప్రేక్షకులకు దగ్గరైంది. గతంలో బిగ్ బాస్ OTT సమయంలో సహ-నటుడు రాకేశ్ బాపత్‌తో ప్రేమలో పడినప్పటికీ, 2022లో తాము విడిపోయామని ఆమె అధికారికంగా ప్రకటించింది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×