E-Paper
Advertisement

Jagapathi Babu: ఎన్టీఆర్ తో మూవీ.. నోటి నుండీ రక్తం కూడా వచ్చేది.. జగపతిబాబు ఊహించని వ్యాఖ్యలు!

Jagapathi Babu: ఎన్టీఆర్ తో మూవీ.. నోటి నుండీ రక్తం కూడా వచ్చేది.. జగపతిబాబు ఊహించని వ్యాఖ్యలు!
Advertisement

Jagapathi Babu: విలక్షణ నటుడిగా ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు జగపతిబాబు (Jagapathi Babu) . తన అద్భుతమైన నటనతో, కామెడీతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా సంపాదించుకున్నారు. అలా అప్పట్లో పదుల సంఖ్యలో హీరోగా సినిమాలు చేసిన జగపతిబాబు.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.. ఒకవైపు కొన్ని చిత్రాలలో విలన్ గా నటిస్తూనే.. మరికొన్ని చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి ఈయన తాజాగా రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ తో సినిమా.. నోటి నుండి రక్తం..

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు ..ఎన్టీఆర్ తో సినిమా చేసేటప్పుడు.. ఆ సినిమా డబ్బింగ్ సమయంలో తన నోటి నుంచి రక్తం కూడా వచ్చింది అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మొరటుగా ప్రవర్తించడం వల్లే..

Advertisement

జగపతిబాబు ఎన్టీఆర్(NTR )తో చేసిన చిత్రం ‘అరవింద సమేత’. ఈ సినిమా జ్ఞాపకాలను ఆయన తాజాగా పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా అరవింద సమేత సినిమా సమయంలో మీ గొంతు విషయంలో స్వర పేటిక కాస్త దెబ్బతిందని విన్నాము.. నిజమేనా? అని ప్రశ్నించగా.. జగపతిబాబు మాట్లాడుతూ..”కాస్త మొరటుగా అనిపించేలా గంటల తరబడి డబ్బింగ్ చెప్పడంతో నా గొంతు కూడా మొరటుగా మారిపోయింది. ఒకానొక సందర్భంలో నోటి నుంచి రక్తం కూడా వచ్చింది. షాకింగ్ వాయిస్ కావాలని ఇలా నేనే చేశాను. ఆ ప్రయత్నంలో అలా జరిగిపోయింది. అయితే మూవీ చేస్తున్నంతసేపు నేను చాలా ఎంజాయ్ చేశాను.. ఎందుకంటే ఆ సమయంలో పిచ్చి పీక్స్ లో ఉన్నాను.
అందుకు తగ్గట్లుగా త్రివిక్రమ్ కూడా అదరగొట్టేశాడు” అంటూ చెప్పుకొచ్చారు.

డబ్బింగ్ వెనుక.. రక్తం వచ్చేంత కష్టం..

ఇకపోతే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో 2018 లో వచ్చిన ఈ చిత్రం పేరుకే మాస్ యాక్షన్ మూవీ అయినప్పటికీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. ముఖ్యంగా “మచ్చల పులి గాండ్రిస్తే ఎట్టా ఉంటదో తెలుసా?” అంటూ వైవిధ్యమైన వాయిస్ తో జగపతి బాబు చెప్పిన డైలాగుకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందని చెప్పాలి. అయితే ఆ డబ్బింగ్ వెనుక రక్తం వచ్చే అంత కష్టం ఉంది అని తెలిసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఒక పాత్రను పండించడంలోనే కాదు ఆ పాత్రకు సరైన స్వరాన్ని అందించడంలో కూడా నటీనటులు ఈ రేంజ్ లో కష్టపడుతున్నారని తెలిసి వారి కష్టానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

జగపతిబాబు తదుపరి చిత్రాలు..

Advertisement

జగపతిబాబు నటిస్తున్న మరిన్ని చిత్రాల విషయానికొస్తే.. పెద్ది సినిమాతో పాటు పౌరాణిక థ్రిల్లర్ నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ లో నటిస్తున్నారు. అలాగే సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం సినిమాలో కూడా ఈయన నటిస్తున్నారు. ఇకపోతే పెద్ది సినిమాలో అప్పలసూరి పాత్రను రివీల్ చేస్తూ తాజాగా ఈయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో గుర్తుపట్టలేని లుక్కులో కనిపించారు. ఇక ఈ సినిమాలతో పాటు సీతా పయనం, సంబరాల ఏటిగట్టు తో పాటు దుల్కర్ సల్మాన్ 41వ సినిమాలో కూడా జగపతిబాబు నటిస్తున్నారు.

Related News

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

Big Stories

Advertisement
×