E-Paper
Advertisement

Khaigal Movie : ఉగాది శుభాకాంక్షలతో “ఖైగల్” ఫస్ట్ లుక్ విడుదల..

Khaigal Movie : ఉగాది శుభాకాంక్షలతో “ఖైగల్” ఫస్ట్ లుక్ విడుదల..
Advertisement

Khaigal Movie : ప్రతి పండగకి సినిమాల సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఉగాది పండక్కి బోలెడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేసాయి.. ఈ సందర్భంగా కొత్త సినిమాలు నుంచి పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. తాజాగా ఉగాది పండగ సందర్భంగా, ‘ఖైగల్’ చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. జై సిద్ధార్థ్ ‘దేవ’ గా హై-వోల్టేజ్ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఫస్ట్ లుక్‌లో, అగ్ని, గందరగోళం మధ్య రక్తసిక్తమైన యోధుడు ఒక శక్తివంతమైన తిరుగుబాటుకు ప్రతీకగా నిలుస్తూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో సతీ పాత్రలో సుష్మిత సింగ్, నందిని పాత్రలో వాంశీ ఉదయ్ నటిస్తున్నారు. దీనికి యశ్‌విన్ దర్శకత్వం వహించారు. గీతా రమేష్, అక్షర జి.ఆర్, సంతోష్ అబ్రహం నిర్మించిన ఈ చిత్రాన్ని, జి.ఆర్ ప్రొడక్షన్స్ మరియు ఖైగల్ వారియర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో రూపొందించబడింది.. ఈ పోస్టర్ లుక్ ఎలా ఉందో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

‘ఖైగల్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. 

ఖైగల్ మూవీ డిఫరెంట్ స్టోరీతో రాబోతుంది. ఒక కోరిక వల్ల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. మాస్ హై వోల్టేజ్ స్టోరీ తో ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. జై సిద్ధార్థ్‌ లుక్ మాత్రం అందరిని ఆకట్టుకుంది. సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని పోస్టర్ ను చూస్తుంటే అర్థమవుతుంది. మొత్తానికి ఈ లుక్ అయితే అంచనాలను పెంచేసింది.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

Advertisement

Also Read :మాధవ్ కోసం మహా నిర్ణయం.. శైలుకు మరో షాక్.. కేశవ దెబ్బకు చక్రీ ఫ్యూజుల్ అవుట్..

మూవీ విషయానికొస్తే..

ఈ మూవీ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో చిత్ర డైరెక్టర్ మాట్లాడుతూ.. “జై సిద్ధార్థ్‌కు 6’2” ఎత్తుతో ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్, ప్రత్యేకంగా నిలిచే శక్తివంతమైన బాస్ వాయిస్ ఉన్నాయి. ఈ రెండూ కలిసి దేవా పాత్రకు ఒక ప్రత్యేకమైన అనుభూతి ని తీసుకువస్తాయి. హీరో నటన ప్రేక్షకులకు నిజంగా ఆకట్టుకునే లాగ ఉంటుంది. ఈ చిత్రం యొక్క బలమైన సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ దేవ్ దీప్ కుండు, ప్రొడక్షన్ డిజైనర్ అరుణాచల నాని, ఆర్ట్ డైరెక్టర్ రవి కొండి, మరియు యాక్షన్ కొరియోగ్రఫీని యోగానంద డిసి అందించారు. సంగీతాన్ని ప్రియేష్ మోతుకూరి స్వరపరచగా, ఎడిటింగ్ బాధ్యతలను ప్రీతమ్ గాయత్రి నిర్వహించారు. పాత్రలకు వాస్తవికతను, లోతును జోడిస్తూ దుస్తులను ఆయేషా మరియం డిజైన్ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివరాజా బిఎన్ పర్యవేక్షణలో, సాగర్ షణ్భోగర్ కో-డైరెక్టర్‌గా రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్ మరియు పబ్లిసిటీ డిజైన్‌ను రాకేష్ జల్లూరి రూపొందించగా, డ్యాన్స్ కొరియోగ్రఫీని గీత అందించారు .పాన్-గ్లోబల్ చిత్రంగా రూపుదిద్దుకున్న ‘ఖైగల్’, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, మరాఠీ, సింహళీ, స్పానిష్, జర్మన్, చైనీస్ మరియు జపనీస్ వంటి 13 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×