Jason Sanjay Sigma: తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ దళపతి విజయ్ వారసుడు జייסన్ సంజయ్ మెగాఫోన్ పడుతూ దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ ‘సిగ్మా’. విలక్షణ నటుడు సందీప్ కిషన్, ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను జులై 31న తమిళ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
Read also-సినీ ప్రపంచంలో విషాదం.. నటుడు, యూట్యూబ్ స్టార్ ఆరోగ్య సమస్యలతో కన్నుమూత..
లండన్‌లో స్క్రీన్‌రైటింగ్‌లో బిఏ హానర్స్, టొరంటో ఫిల్మ్ స్కూల్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా పూర్తి చేసిన సంజయ్, తన మొదటి సినిమా కోసమే ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ గ్లింప్స్ ప్రకారం.. ‘సిగ్మా’ ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు. “సమాజంలో భూమి, నీరు, గాలి, డబ్బు.. ఇలా అన్నింటి విలువ పెరుగుతోంది, కానీ మనిషి విలువ మాత్రం పడిపోతోంది” అనే బలమైన సామాజిక సందేశం ఉన్న పాయింట్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సంజయ్ ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నారు.
ఈ సినిమాలో సందీప్ కిషన్ సరికొత్త రగ్గడ్ లుక్‌లో, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలో కనిపించనున్నారు. ఆయన సరసన ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం, సీనియర్ నటుడు సంపత్ రాజ్, శివ్ పండిత్, అన్బు దాసన్, యోగ్ జేపి వంటి తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ‘సిగ్మా’ చిత్రంపై అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం ఆయన తర్వాత తన కుమారుడి సినిమా డెబ్యూ కావడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జులై 31న థియేటర్లలో ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.
Read also-‘పెద్ది’ టికెట్ రేట్ల పెంపు.. ప్రత్యేక షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
A high-stakes heist begins. 💵 #SIGMA storms into theatres on July 31st. 🗓️ Gear up for the ultimate quest. 🔥@official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @jsjmedia01 @sundeepkishan @MusicThaman @fariaabdullah2 #RajuSundaram #SampathRaj @shivpanditt @follow_anbu… pic.twitter.com/Sd87kylWZN
— Lyca Productions (@LycaProductions) May 29, 2026