E-Paper
Advertisement

మండవ,మోత్కుపల్లి… ఓ పశ్చాత్తాపం, ఓ భావోద్వేగం.. అన్నపై అదే అభిమానం!

మండవ,మోత్కుపల్లి… ఓ పశ్చాత్తాపం, ఓ భావోద్వేగం.. అన్నపై అదే అభిమానం!
Advertisement

మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు, మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత‌. రాజ‌కీయ విలువ‌లు పాటించే వ్య‌క్తి. బీఆరెస్‌లో చేరినా అక్క‌డ ఇమ‌డ‌లేదు. ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పంచ‌న చేరినా.. ఇక్క‌డా ఇమ‌డ‌లేదు. అందుకే రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల త‌రువాత నిన్న అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు స‌భ‌లో క‌నిపించాడు. మాట్లాడానికి అవ‌కాశం ఇచ్చారు. అప్ప‌టికీ ఇప్ప‌టికీ తేడా లేదు. అదే కంచుకంఠం. సూటిగా, ఉన్న‌దున్న‌ట్టుగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి సీఎం కావ‌డానికి కూడా ఎన్టీఆరే స్పూర్తి అని అన్నాడు. యువ‌కులుగా ఉన్న‌ప్పుడు ఆయ‌న ప్ర‌సంగంతో ఉత్తేజితులై రాజ‌కీయాల్లోకి వ‌చ్చామ‌న్న ఆయ‌న‌.. రాడిక‌ల్స్ కూడా తీసుకురాని విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల‌ను జ‌న‌జీవ‌నంలో తీసుకొచ్చిన మ‌హానేత ఎన్టీఆర్ అని కీర్తించాడు.

ఆ తరువాత చంద్ర‌బాబు అస‌మ్మ‌తి అంశం కూడా సుతిమెత్త‌గా, ప‌రోక్షంగా ట‌చ్ చేశాడు. అప్పుడు ఆ రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో అన్న‌ను వీడి పోవాల్సి రావ‌డం.. ఇప్ప‌టికీ బాధాక‌ర‌మేన‌ని ఆయ‌న ప‌శ్చాత్తాప‌ప‌డ్డారు.అప్ప‌టి జ్ఞాప‌కాల‌ను ఇంకా నెమ‌రువేసుకుని త‌న విశ్వాసాన్ని ప్ర‌క‌టించుకున్నాడు మండ‌వ. ఇక అదే రోజు మోత్కుపల్లి న‌ర్సిహుంలు కూడా జ‌యంతి సంద‌ర్బంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించి.. భావోద్వేగానికి గుర‌య్యాడు. కంట‌త‌డి పెట్టుకున్నాడు. ఇది న‌ట‌న కాదు. రాజకీయం కోసం చేసే డ్రామాలు అస‌లే కావు. అప్ప‌టి నేత‌లు.. ఆయ‌న ఇచ్చిన రాజ‌కీయ ప‌దువులు, పంచిన ఆత్మీయ‌త‌ను ఇప్ప‌టికీ మ‌రిచిపోలేని వారి విశ్వాస‌మే ఇందుకు తార్కాణం. ఎన్టీఆర్ అంటే అంత‌టి అభిమానం ఇంకా ఉంది తెలంగాణ లీడ‌ర్ల‌లో అని చెప్ప‌డానికి ఇదో నిద‌ర్శ‌నం. వాస్త‌వానికి అప్ప‌టి రాజ‌కీయాలు ఇప్పుడు లేవు .. అని కూడా వీరు న‌మ్ముతున్నారు.

Advertisement

అందుకే రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. త‌మ‌కు ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు సెట్ కాద‌ని డిసైడ్ చేసుకున్న‌ట్టున్నారు. కేసీఆర్ కూడా మోత్కుప‌ల్లిని ఆశ‌ల ప‌ల్ల‌కిలో ఊరేగించాడు. కానీ ఆ త‌రువాత ష‌రా మామూలుగా ప‌ట్టించుకోలేదు. మండ‌వకు కూడా రెండు పార్టీల్లో భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఇప్ప‌టి నేత‌ల్లాగా ప‌ట్టించుకోకున్నా..ప‌ద‌వుల కోసం వెంప‌ర్లాడే ర‌కాలు కాదు.. ఈ నేత‌లు. అందుకే దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా మ‌రోసారి ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ మ‌నోభావాల‌ను, భావోద్వేగాల‌ను తెలియ‌జేశారు.

క‌ష్ట‌కాలంలో అన్న‌తో ఉండ‌లేక‌పోయామ‌నే ప‌శ్చాతాపాన్ని కూడా ప్ర‌క‌టించుకున్నారు ఈ సంద‌ర్బంగా. ఎన్టీఆర్ స్పూర్తితోనే ఇంత వ‌ర‌కు రాగ‌లిగామ‌ని కేసీఆర్, రేవంత్ ఇద్ద‌రూ చెప్పుకున్న సంద‌ర్బాలున్నాయి. కానీ ఆ నేత‌లాగా.. ఇప్పుడు వీరిద్ద‌రు త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవ‌డంలో మాత్రం విఫ‌మ‌య్యార‌ని చెప్పుకుంటున్నారు అప్ప‌టి సీనియ‌ర్ నేత‌లు. అందుకే రేవంత్ నోటి వెంట నుంచి వ‌చ్చిన.. ఎన్టీఆర్ ద్వారా తెలంగాణ‌కు అందివ‌చ్చిన నేత‌లంతా ఇప్పుడు రాజ‌కీయాల‌కు దూరంగానే ఉన్నారు. చివ‌ర‌కు కేసీఆర్‌తో స‌హా. ఆయ‌న కూడా ప్ర‌స్తుతానికి ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×