E-Paper
Advertisement

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సదా చెల్లెలు.. ఫోటోలు వైరల్!

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సదా చెల్లెలు.. ఫోటోలు వైరల్!

Tollywood: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా తమ కెరీర్ ను ఆరంభించి, పదుల సంఖ్యలో సినిమాలు చేసి చదువుల నిమిత్తం ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు..ఆ తర్వాత కొంతమంది సినిమా ఇండస్ట్రీలోకే రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతుంటే.. మరికొంతమంది భిన్నమైన కెరియర్ ను ఎంచుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. ఇంకొంతమంది వివాహం చేసుకొని ఇంటికే పరిమితమవుతూ ఉంటారు. అంతేకాదు అప్పుడప్పుడు తమ జీవితంలో జరిగే సంతోషకర విషయాలను అభిమానులతో పంచుకుంటూ మళ్ళీ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో జయం సినిమాలో సదా చెల్లెలుగా నటించి , ప్రేక్షకులను ఆకట్టుకున్న యామిని శ్వేతా నాయుడు కూడా ఒకరు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో, వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ అమ్మాయి ఈ సినిమా తర్వాత కొన్ని చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమైంది.

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సదా చెల్లెలు..

కానీ ఇప్పుడు సడన్గా పండంటి బాబుకు జన్మనిచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమెకు ఇది రెండవ సంతానం. గతంలోనే ఈమెకు ఒక కుమార్తె జన్మించింది.. ఇప్పుడు మగ బిడ్డ జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది యామిని. ప్రస్తుతం యామినికి పండంటి కొడుకు జన్మించాడని తెలిసి అభిమానులు , సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నలుగురికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో క్యూట్ జోడి అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇకపోతే సినిమాలకు దూరమైన యామిని శ్వేతా నాయుడు అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడింది.. ఇక ప్రస్తుతం ఒకవైపు ఉద్యోగం మరొకవైపు కుటుంబాన్ని చూసుకుంటుంది. యామిని శ్వేతా నాయుడు ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటి జయలక్ష్మి కుమార్తె..

also read:Raaka Movie: రాకా స్టోరీ లీక్.. డ్యూయల్ అనుకున్నామే.. ఈ ట్విస్ట్ ఊహించలేదు భయ్యో!

యామిని శ్వేతా నాయుడు కెరియర్..

యామిని శ్వేత నాయుడు విషయానికి వస్తే.. 2002లో సదా నితిన్ జంటగా వచ్చిన జయం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా, సదా చెల్లెలిగా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఇందులో ఉత్తమ నటన కనబరిచినందుకు గానూ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో నంది అవార్డును కూడా అందుకుంది. ఇందులో ముక్కు సూటిగా మాట్లాడే చిన్న చెల్లెలు పాత్ర పోషించింది యామిని. ఇకపోతే ఈ సినిమా తర్వాత కొన్ని సీరియల్స్ లో నటించిన ఈమె.. ఆ తర్వాత ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు వంటి చిత్రాలలో నటించింది. చివరికి చదువుపై దృష్టి సారించి ఇండస్ట్రీకి దూరమైంది. మాస్టర్స్ పూర్తి చేసిన ఈమె వివాహం తర్వాత అక్కడే సెటిల్ అయిపోయింది . ఇక సిల్వర్ స్క్రీన్ కి దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు తన ఫోటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేసే ఈమె ఇప్పుడు మరోసారి తల్లి అయినట్లు అభిమానులతో పంచుకుంది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

×