E-Paper
Advertisement

విదేశీ యూనివర్సిటీలో తెలుగు సినిమా పాఠాలు.. ఆ మూవీపై మృణాల్ ప్రశంసలు!

విదేశీ యూనివర్సిటీలో తెలుగు సినిమా పాఠాలు.. ఆ మూవీపై మృణాల్ ప్రశంసలు!
Advertisement

Mrunal Thakur: ఒకప్పుడు తెలుగు సినిమా అంటే బాలీవుడ్ సినీ పరిశ్రమ సెలబ్రిటీలు కూడా తక్కువ చేసి చూసిన రోజులు ఉన్నాయి. కానీ నేడు రాజమౌళి , సుకుమార్ , సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ లాంటి దిగ్గజ దర్శకుల వల్ల తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటింది అనే చెప్పాలి. ఇక ఈ దిగ్గజాలు సృష్టించిన ప్రభంజనానికి బాలీవుడ్ నటీనటులే కాదు హాలీవుడ్ నటీనటులు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అంటే టాలీవుడ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ గుర్తింపు ఎల్లలు దాటి అంతర్జాతీయంగా పాకి పోతున్న నేపథ్యంలో అక్కడి యూనివర్సిటీలో కూడా తెలుగు చిత్రాలను పాఠాలుగా బోధిస్తున్నారు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది మన సీతామహాలక్ష్మి అలియాస్ మృణాల్ ఠాకూర్.

తెలుగు సినిమాకి గ్లోబల్ స్థాయి గుర్తింపు..

ప్రముఖ హీరో అడివి శేష్ హీరోగా డెకాయిట్ సినిమాతో ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. సరస్వతి , జూలియట్ పాత్రలతో అదరగొట్టేసింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో హీరోని మించి పర్ఫామెన్స్ కనబరిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది మృణాల్ ఠాగూర్. ఈ సినిమా సక్సెస్ అందుకున్న నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఠాగూర్ తెలుగు సినిమా పరిశ్రమపై తనకున్న గౌరవాన్ని అలాగే గ్లోబల్ స్థాయిలో ఆమెకున్న క్రేజ్ ని, తెలుగు చిత్రాలకు అంతర్జాతీయంగా దక్కుతున్న గుర్తింపు గురించి అభిమానులతో పంచుకుంది.

విదేశీ యూనివర్సిటీలో తెలుగు పాఠాలు..

Advertisement

ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ..” నా తమ్ముడు ఒక ఫిలిం స్టూడెంట్.. తన కాలేజీలో ఉండే ప్రొఫెసర్లు దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా క్లాసులు కూడా చెబుతున్నారట. ఒక తెలుగు సినిమాను విదేశీ యూనివర్సిటీలో పాఠాలుగా బోధించడం చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది.. నేను గ్లోబల్ వేదికపై నిలబడినప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు , భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నాను. అదే నా కోరిక కూడా.. ముఖ్యంగా మన కథలు, మన సాంకేతికత ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకున్నాయి.. ఇక వీటన్నింటిని చూస్తుంటే తెలుగు సినిమా గుర్తింపు ఏ రేంజ్ లో ఎల్లలు దాటిందో అర్థమవుతుంది” అంటూ తన అభిప్రాయాలను పంచుకుంది.ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాజమౌళి పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు

also read:పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సదా చెల్లెలు.. ఫోటోలు వైరల్!

మృణాల్ ఠాకూర్ సినిమా కెరియర్..

Advertisement

మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే.. సీతారామం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రతో అబ్బురపరిచింది. హాయ్ నాన్న సినిమాలో యష్న పాత్రలో సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకొని డెకాయిట్ సినిమాలో యాక్షన్ డ్రామా తో అదరగొట్టేసింది. ఏది ఏమైనా మృణాల్ ఠాకూర్ కి ఇప్పుడు తెలుగులో మళ్లీ గట్టి కం బ్యాక్ దొరికింది అని చెప్పడంలో సందేహం లేదు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×