E-Paper
Advertisement

Jayam Ravi: జయం రవి సంచలన వ్యాఖ్యలు..హీరోకు మాజీ భార్య సోదరి స్ట్రాంగ్ రిప్లై

Jayam Ravi: జయం రవి సంచలన వ్యాఖ్యలు..హీరోకు మాజీ భార్య సోదరి స్ట్రాంగ్ రిప్లై
Advertisement

Jayam Ravi: తమిళ సినీ హీరో జయం రవి వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. ఇటీవల ఆయన చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు పెద్ద వివాదానికి దారి తీసింది. “పురుషులే నిజంగా అతిపెద్ద బాధితులు” అని జయం రవి చేసిన వ్యాఖ్యలపై అభిమానులు, నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన మాజీ భార్య ఆర్తి సోదరి తనుజ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.

జయం రవి తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు 2024 సెప్టెంబర్‌లో ప్రకటించాడు. ఈ వార్త అప్పట్లో సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. 2009లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొంతకాలంగా వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ వేరుగా జీవిస్తున్నట్లు సమాచారం. తరువాత రవి విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నాడు.

పురుషులే అతిపెద్ద బాధితులంటూ జయం రవి వ్యాఖ్యలు..

Advertisement

ఇటీవల జయం రవి దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా “యాన్ ఆర్డినరీ మ్యాన్” పూజ కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో యోగి బాబు హీరోగా నటిస్తున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను జయం రవి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ ఫోటోలలో సింగర్ కనిషా ఫ్రాన్సిస్ కూడా కనిపించింది. దీంతో ఇద్దరి మధ్య స్నేహం లేదా సంబంధం ఉందని కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేయడం ప్రారంభించారు.

కొంతమంది నెటిజన్లు కనిషాపై తీవ్రంగా కామెంట్లు చేయడంతో ఈ విషయం మరింత పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలో జయం రవి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు. తాను ప్రశాంతంగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని, కానీ సమాజం ఎప్పుడూ మహిళల మాటనే నిజం అనుకుంటుందని పేర్కొన్నాడు. నిజానికి పురుషులే ఎక్కువగా బాధపడుతారని, ఒక రోజు నిజం అందరికీ తెలుస్తుందని కూడా చెప్పాడు.

తనుజ కౌంటర్ వైరల్

Advertisement

ఈ పోస్టుకు స్పందిస్తూ ఆర్తి సోదరి తనుజ ఒక కామెంట్ చేసింది. “మీకు సంతోషం కలిగించే వ్యక్తి ఎవరూ లేరు. ఆ పని నా సోదరి చేసేది” అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ఈ కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

అయితే తనుజ చేసిన వ్యాఖ్యలపై కూడా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమెకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు పూర్తిగా విషయం తెలియకుండా వ్యాఖ్యలు చేయకూడదని విమర్శిస్తున్నారు. మొత్తానికి జయం రవి వ్యక్తిగత జీవితం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ALSO READ: Meenakshi Chaudhary: ఘాటు అందాలతో సెగలు పుట్టిస్తున్న మీనాక్షి.. ఫోటోలు వైరల్

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×