E-Paper
Advertisement

JD Chakravarthy: యాటిట్యూడ్ స్టార్ పాట గురించి జేడీ రియాక్షన్ ఇదే.. చప్పట్లు ఎందుకు కొట్టారంటే?

JD Chakravarthy: యాటిట్యూడ్ స్టార్ పాట గురించి జేడీ రియాక్షన్ ఇదే.. చప్పట్లు ఎందుకు కొట్టారంటే?
Advertisement

JD Chakravarthy: సినిమా ప్రమోషన్ల కోసం ఈ మధ్యకాలంలో కొందరు కొత్త దారులు వెతుకుతున్నారు. అయితే అవి ఒక్కోసారి శృతిమించి వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా వేడుకలో జరిగిన సంఘటన టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ వేడుకలో చంద్రహాస్ పాడిన ఒక పాటలో అసభ్యకరమైన పదాలు (బూతులు) ఉండటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న జేడీ చక్రవర్తి పాట పాడుతుండగా చప్పట్లు కూడా కొట్టారు. దీనిపై నటుడు జేడీ చక్రవర్తి సుమన్ టీవీ ఇంటర్వ్యూలో స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రహాస్ వేదికపై ఒక పాట పాడారు. ఆ పాటలోని సాహిత్యం పచ్చి బూతులతో కూడి ఉండటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఈ వేదికపై అతిథిగా ఉన్న జేడీ చక్రవర్తి కూడా ఆ పాటను ఎంజాయ్ చేస్తూ చప్పట్లు కొట్టారని విమర్శలు వచ్చాయి. అయితే జేడీ చక్రవర్తి ఈ ఆ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు.

Read also-Anaganaga Oka Raju Collections : ‘అనగనగా ఒకరాజు’ క్లోజింగ్ కలెక్షన్స్.. నష్టమా? లాభామా..?

జేడీ చక్రవర్తి వివరణ

Advertisement

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ, తాను ఆ పాట విన్నప్పుడు షాక్‌కు గురయ్యానని తెలిపారు. “నేను చప్పట్లు కొట్టలేదు, నా పక్కన ఉన్న వారు కొట్టిన చప్పట్లను నాకు ఆపాదిస్తూ వీడియోలను ఎడిట్ చేశారు” అని క్లారిటీ ఇచ్చారు. పాట మొదలైనప్పుడు అతను సింగర్ కూడానా అనే ఆశ్చర్యంలో ఉన్నానని, పదాలు అర్థమయ్యాక చాలా అసౌకర్యంగా అనిపించిందని పేర్కొన్నారు. తన పక్కనే ఉన్న నటి పూజా బేడికి తెలుగు రాకపోవడంతో, ఆమెకు ఆ పాటలోని అర్థం తెలియక నవ్వుతూ ఉందని, తాను మాత్రం చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు. “నీకు తెలుగు రాకపోవడమే మంచిది, అతను పాడుతున్నది పచ్చి బూతులు” అని ఆమెతో అన్నట్లు జేడీ వివరించారు. అదే సమయంలో వేదిక నుండి వెళ్ళిపోవాలని అనుకున్నా.. ఆ పాట వింటున్నప్పుడు భరించలేక అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నానని, కానీ పూజా బేడి తనను వారించిందని ఆయన చెప్పారు. “నేను వెళ్ళిపోతే జేడీ చక్రవర్తి గొడవ చేసి వెళ్ళిపోయారు అనే నెగటివ్ వార్తలు వస్తాయి, అది సినిమా భవిష్యత్తును దెబ్బతీస్తుంది” అని ఆమె చెప్పడంతో ఆగిపోయానని జేడీ తెలిపారు. వ్యక్తిగతంగా తనకు ఇలాంటివి ఇష్టం ఉండవని, గతంలో సెట్స్‌లో బూతులు మాట్లాడిన వారిని, అసభ్యంగా ప్రవర్తించిన వారిని తాను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.

Read also-Payal Raj Puth: 12 ఏళ్ల కష్టం.. అంత ఈజీగా వదిలేస్తానా.. ట్రోల్స్ కి పాయల్ చెక్!

ప్రభాకర్ స్పందన

Advertisement

ఈ వివాదంపై చంద్రహాస్ తండ్రి ప్రభాకర్‌తో తాను మాట్లాడానని, తన కొడుకు అప్పటికప్పుడు అలా పాడతాడని తాను ఊహించలేదని ప్రభాకర్ తనతో చెప్పినట్లు జేడీ చక్రవర్తి వెల్లడించారు. సినిమా రంగంలో నెగటివ్ పబ్లిసిటీ ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని చూడటం సరికాదని జేడీ చక్రవర్తి హితవు పలికారు. “కంటెంట్ బాగుంటేనే సినిమా ఆడుతుంది. ఇలాంటి పనుల వల్ల వ్యూస్ వస్తాయేమో కానీ, ప్రేక్షకుల గౌరవం దక్కదు” అని ఆయన స్పష్టం చేశారు. యువ నటులు ఇలాంటి అపసవ్య మార్గాలను ఎంచుకోకుండా, ప్రతిభతో రాణించాలని ఆయన సూచించారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×