E-Paper
Advertisement

Anaganaga Oka Raju Collections : ‘అనగనగా ఒకరాజు’ క్లోజింగ్ కలెక్షన్స్.. నష్టమా? లాభామా..?

Anaganaga Oka Raju Collections : ‘అనగనగా ఒకరాజు’ క్లోజింగ్ కలెక్షన్స్.. నష్టమా? లాభామా..?
Advertisement

Anaganaga Oka Raju Collections : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ జనాలను కడుపుబ్బాని నవ్వించడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది. జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి వసూళ్లు అందాయి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ఇది..ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.. ఈ సినిమాలు క్లోజింగ్ కలెక్షన్స్ ఒకసారి తెలుసుకుందాం..

‘అనగనగా ఒక రాజు’ క్లోజింగ్ కలెక్షన్స్..

రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ వంటి నటీనటులు కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించారు. యువరాజ్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు.. రిలీజ్ కి ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిన తర్వాత అంతకుమించి వసూళ్లను అందుకుంది. ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో మంచి రేటుకు అమ్ముడు పోయింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. పొలిటికల్ టచ్‌తో కంప్లీట్ రూరల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించారు.. ఫైనల్ గా ఈ మూవీకి 110 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. అంటే సినిమాకు భారీ లాభాలు వచ్చినట్లే..

Advertisement

Also Read :శ్రీవల్లికి టెన్షన్.. నర్మదకు నిజం చెప్పిన ప్రేమ.. అమూల్యకు దిమ్మతిరిగే షాక్..

ఏ ఏరియాలో ఎన్నికోట్లు రాబట్టిందంటే..? 

అనగనగా ఒక రాజు డిఫరెంట్ స్టోరీ తో లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ మూవీ జనవరి 14న రిలీజ్ అయింది. కామెడీ వర్కౌట్ అవడంతో సినిమాకు కలెక్షన్లు కూడా కలిసి వచ్చాయి. క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాంలో 12.5 కోట్లు, సీడెడ్‌లో 4.5 కోట్ల, ఈస్ట్ గోదావరి జిల్లాలో 4 కోట్లు, గుంటూరు జిల్లాలో 2.5 కోట్లు, వెస్ట్ గోదావరి 2.25 కోట్లు, కృష్ణా జిల్లాలో 2 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. ఈ సినిమా 36 కోట్ల రూపాయల షేర్, 60 కోట్లు, పైగా వసూళ్లను సొంతం చేసుకుంది. కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1 కోటి రూపయాలు, మొత్తం వరల్డ్ వైడ్ గా దాదాపుగా 110 వసూల్ చేసినట్లు టీం అనౌన్స్ చేసింది.. దాదాపు 40 కోట్ల నుంచి 110 కోట్ల వరకు కలెక్షన్లు రావడంతో ఈ మూవీ భారీ సక్సెస్ ని అందుకున్నట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి రెండు మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది..

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×