Jhansi:నటి, యాంకర్ ఝాన్సీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న తాజాగా ఆమె తన కెరీర్ గురించి మాత్రమే కాకుండా ,పర్సనల్ లైఫ్ గురించి , తన ఆలోచనలు, ఇష్టాయిష్టాల గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గాయత్రి భార్గవి నిర్వహిస్తున్న ‘నవరస’ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఝాన్సీ.. ఇలా పలు విషయాలపై మాట్లాడారు.
సినిమా ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడుతూ ఇలాంటి వాటిని ఎవరూ ఎంకరేజ్ చేయొద్దని, ఇండస్ట్రీలో మంచి పోజిషన్ కి చేరిన ఎవరిపైనా అయినా ఈజీగా నిందలు వేస్తారని ,ఎలాంటి కమిట్ మెంట్స్ ఇవ్వకుండానే ఆ స్థానానికి చేరుకుందా అంటూ ఈజాగా అనేస్తారని వాపోయింది. మహిళలకు గౌరవం, అవకాశాల విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
ప్రతి పనీ నేనే చేయాలనుకోవడం లేదు
ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఝాన్సీ ఓ ఆసక్తికరమైన విషయం తెలిపారు. కెరీర్ మొదట్లో అసలు ఖాళీ లేకుండా పనిచేసేదానినని ,ఒక షూట్ పూర్తవగానే మరో షూట్ కి వెళ్లడం.. అలా రోజంతా బిజీగా గడిపేదానినని కానీ ఇప్పుడు తన ఆలోచనా విధానం మారిందని అన్నారు.
ప్రతి పనీ తానే చేయాలని, ప్రతి అవకాశాన్నీ తానే అందిపుచ్చుకోవాలని అనుకోవడం లేదని, ఒకే సమయంలో రెండు ఈవెంట్స్ ఉంటే, తాను చేయలేని పనిని మరొకరికి అప్పగించడం మంచిదని భావిస్తానని ఇలా చేయడం వల్ల తనకు ఇబ్బంది ఉండటమే కాకుండా.. మరో వ్యక్తికి కూడా పని చేసే అవకాశం దొరుకుతుందని తెలిపారు.
ప్రతి విషయంలో పోటీ పడాల్సిన అవసరం లేదు
జీవితంలో ప్రతి విషయంలోనూ ఇతరులతో పోటీ పడుతూ ఉండాల్సిన అవసరం లేదని మనకు సంబంధం లేని పోటీలోకి వెళ్లి అనవసరంగా ఒత్తిడి తెచ్చుకోవడం కంటే.. మనకు నచ్చిన పని చేసుకుంటూ సంతోషంగా ఉండటమే ముఖ్యమని మనసులోని మాటని బయటపెట్టారు.
ఇక కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా.. ఎంత పేరు సంపాదించినా మనశ్శాంతి కూడా ముఖ్యమే. ఇతరులతో పోల్చుకుంటూ ఎప్పుడూ పరుగులు పెట్టడం కంటే, మనకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం మంచిదని తెలిపారు.
సినిమాలే కాదు.. ఇంకా చాలా ఇష్టాలున్నాయ్
ఇక సినిమాలు, యాంకరింగ్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఆసక్తులు ఉన్నాయని పుస్తకాలు చదవడం, రాయడం, మొక్కలు పెంచడం, వ్యవసాయం చేయడం, పెయింటింగ్ వేయడం వంటివి ఇష్టంగా చేస్తానని చెప్పుకొచ్చారు.షూటింగ్స్ లేని సమయంలో ఇలాంటి పనులు చేస్తూ సమయాన్ని గడుపుతానని ఎప్పుడూ ఒకే పని చేస్తూ ఉండకుండా కొత్త కొత్త విషయాలు ప్రయత్నించడం తనకు ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.
ఇక పెంపుడు కుక్కల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని,ఇంట్లో ఉన్న కుక్కపిల్లను చూసుకోవడం, దాని అవసరాలను గమనించడం వంటి పనులను తన బాధ్యతగా భావిస్తానని , బిజీగా ఉండే రోజుల్లోనూ వీలైనంత సమయం వాటి కోసం కేటాయించడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చారు.
విశ్రాంతి కోసం ప్రత్యేకంగా ఓ రోజు!
ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలనే ఆలోచన తనలో ఎక్కువగా ఉంటుందని అయితే ఎప్పుడూ పని చేస్తూనే ఉండటం కూడా మంచిది కాదని గుర్తించాలని అన్నారు. అందుకే కొన్నిసార్లు ఏ పనీ చేయకుండా ప్రశాంతంగా గడిపేందుకు ముందుగానే ఓ రోజును కేటాయించుకుంటానని చెప్పుకొచ్చారు.మొత్తానికి, గాయత్రి భార్గవి నిర్వహించిన ‘నవరస’ పాడ్కాస్ట్లో ఝాన్సీ పంచుకున్న ఈ సరదా విషయాలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయ్.
ALSO READ :యూత్ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!