E-Paper
Advertisement

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!
Advertisement

Haiku Movie:ఏగన్, ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హైకూ’ సినిమా అక్టోబర్ 23న థియేటర్లలోకి రాబోతోందన్న సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు కోన వెంకట్, దర్శకుడు రామ్ జగదీశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కోన వెంకట్ మాట్లాడుతూ ‘హైకూ’ ట్రైలర్ చూసినప్పుడు చాలా కూల్‌గా, ఆహ్లాదంగా అనిపించిందని చెప్పారు. ఇది ఒక మంచి ప్రేమకథ అని, ప్రేక్షకులను కచ్చితంగా ఎగ్జైట్ చేస్తుందని అన్నారు. ముఖ్యంగా కాలేజీ రోజుల్లో ఉండే సరదాలు, స్నేహాలు, ప్రేమలోని మధురమైన క్షణాలను ఈ సినిమాలో చూపించారని తెలిపారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికీ తమ కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రేమకథలను ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను తప్పకుండా చూడాలని అన్నారు.

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే ఓటీటీ రైట్స్ అమ్ముడవడం గొప్ప విషయమని అన్నారు. నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థకు కథ నచ్చి సినిమా చేసేందుకు ముందుకు రావడం చూస్తుంటే, కథలో ఎంత బలం ఉందో అర్థమవుతోందని చెప్పారు. ఈ సినిమాలో శ్రీదేవి కోసం కూడా ప్రత్యేకంగా సినిమా చూడాలంటూ శ్రీదేవిని ఆకాశానికి ఎత్తేశారు కోనా.ఇక ఏగన్‌ను టాలీవుడ్ కి వెల్ కమ్ చేస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.

హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. ‘హైకూ’ కథ తనకు చాలా బాగా నచ్చిందని, కథ వినగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నానని చెప్పారు. ప్రేమలో ఉన్నవాళ్లు, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లు, పెళ్లైన జంటలు కూడా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారని అన్నారు. ప్రేమలో ఎదురయ్యే సమస్యలు, బంధాల్లో వచ్చే ఇబ్బందులను ఇందులో చూపించారని తెలిపారు. హీరో ఏగన్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా అనిపించిందని చెప్పారు. దర్శకుడు తనను ఎంతో ప్రశాంతంగా చూసుకున్నారని, సినిమా కోసం టీమ్ మొత్తం బాగా సహకరించిందని అన్నారు. అక్టోబర్ 23న థియేటర్లలో సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులను కోరారు.

Advertisement

హీరో ఏగన్ మాట్లాడుతూ.. ‘హైకూ’ సినిమా కోసం తామంతా ఎంతో కష్టపడ్డామని చెప్పారు. ఈ సినిమాపై తనకు చాలా నమ్మకం ఉందని అన్నారు. సంగీత దర్శకుడు సిద్ధు కుమార్ మంచి పాటలు, సంగీతం అందించారని తెలిపారు. దర్శకుడు యువరాజ్ చిన్నసామితో తనకు పదేళ్లుగా పరిచయం ఉందని, ఇన్నాళ్లకు ఆయనతో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. సినిమా విడుదలైన తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌లో కలుద్దామని ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. తమిళంలో రూపొందిన ‘హైకూ’ ఇప్పుడు తెలుగులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. హీరోయిన్ శ్రీదేవి నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆమె కళ్లతోనే భావాలను చక్కగా పలికించగలరని చెప్పారు. ఈ సినిమా కోసం శ్రీదేవి ఎంతో కష్టపడ్డారని, సినిమా అవుట్‌పుట్ కూడా చాలా బాగా వచ్చిందని తెలిపారు. ముఖ్యంగా యూత్‌కు ఈ సినిమా బాగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహించారు. డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రేమ, కాలేజీ జ్ఞాపకాలు, బంధాల్లోని సమస్యలతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి కోన వెంకట్ చెప్పినట్లుగా ‘హైకూ’ ప్రేక్షకులను మళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్తుందో లేదో !

ALSO READ :మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Tags

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

Big Stories

Advertisement
×