E-Paper
Advertisement

Actor Sivakarthik: సినిమాల్లోకి వచ్చాక నేను చేసిన మిస్టేక్ ఇదే.. నన్ను తొక్కేస్తున్నారు..

Actor Sivakarthik: సినిమాల్లోకి వచ్చాక నేను చేసిన మిస్టేక్ ఇదే.. నన్ను తొక్కేస్తున్నారు..
Advertisement

Actor Sivakarthik: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలలో బడా ఫ్యామిలీలు కొన్ని ఉన్నాయి.. వాళ్ల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతున్నారు. అయితే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కొంతమంది నటీనటులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఫైనల్ గా సినిమాల్లో అవకాశాలను అందుకున్నారు. అలాంటివారు చాలా కొద్ది మందే ఉన్నారు. తమ టాలెంట్ మీద నమ్మకంతో ఇండస్ట్రీలోకి వచ్చిన కొందరు ఇప్పటికీ గుర్తింపు లేకుండా ఉన్నారు.. అలాంటి వారిలో యాక్టర్ శివ కార్తీక్ ఒకరు.. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ తాను ఫేమస్ అవ్వలేకపోవడానికి గల కారణాలను వివరించారు. అసలు ఎందుకు ఆయన ఫేమస్ అవ్వలేకపోయాడు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే.. 

సినీ నటుడు శివ కార్తిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాల అయినట్టు ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే ఇన్ని సంవత్సరాల వరకు మీరు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సరే మీకు ఒక స్టార్ ఇమేజ్ అనేది రాకపోవడానికి గల కారణాలు ఏంటి అని యాంకర్ అడుగుతారు.. దానిపై స్పందించిన శివకార్తిక్ మాట్లాడుతూ.. నేను జోష్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను. అందులో నా క్యారెక్టర్ కు మంచి మార్కులు పడ్డాయి. కానీ ఇప్పటికీ నేను సినిమాలు చేసిన కూడా పెద్దగా నాకు గుర్తింపు లేదు. అందుకు కారణం నేను పీఆర్ టీమ్ ని మెయింటెన్ చేయకపోవడమే.. నా గురించి నేను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోకపోవడమే.. అందుకే ఇప్పటికీ నేను మంచి యాక్టర్ అని ఎవరు గుర్తించలేదు. నేను చేసిన ఈ మిస్టేక్ వల్లే ఇండస్ట్రీలో ఇప్పటికీ నాకు స్టార్ ఇమేజ్ దక్కలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు..

Advertisement

Also Read :‘ ఇంటింటి రామాయణం ‘ రాజేంద్ర ప్రసాద్.. బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

పదేళ్ల తర్వాత నేనేంటో తెలుస్తుంది.. 

ఈమధ్య చిన్న నటులకు పెద్దగా అవకాశాలు రావడంలేదని శివ కార్తీక్ బయటపెట్టారు.. కొందరు కావాలని తొక్కేస్తున్నారు అని ఆయన ఇండస్ట్రీలో జరుగుతున్న నిజాలను వివరించారు.. ఇప్పుడు మీ గురించి పెద్దగా ఎవరికి తెలియలేదు. ఎందుకని ఇలా మీరు జనాలకు దూరంగా ఉన్నారు అని యాంకర్ అడుగుతారు. సోషల్ మీడియాకు నేను దూరంగా ఉండటమే కారణం. ఇప్పుడు శంబాల సినిమాలు చేశాను. ఆ మూవీలో నా క్యారెక్టర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇలానే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారెందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. మంచి క్యారెక్టర్లు వస్తే ఖచ్చితంగా నేనేం ప్రూవ్ చేసుకుంటాను అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేను ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ గా కొనసాగాలంటే మరో పదేళ్లు పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ తన ఎమోషనల్ స్టోరీ ని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో టాలెంట్ ఉన్నవాళ్లు ఎవరైనా సరే జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు..

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×