E-Paper
Advertisement

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?
Advertisement

Jr NTR Wishes Balakrishna:’NBK 111’సినిమా షూటింగ్ కోసం కాకినాడ పోర్ట్ వద్ద బాలయ్య తీవ్రంగా గాయపడటంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చిన సంగతి తెల్సిందే.ఇక బాలయ్య త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ ప్రముఖులు తమ విషెస్ ని షోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే గెట్ వెల్ సూన్ బాబాయ్ అంటూ కళ్యాణ్ రామ్ తన విషెస్ అందించగా తాజాగా బాబాయ్ కోసం యంగ్ టైగర్ తారక్ కూడా తన విషెస్ ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

“త్వరగా కోలుకోండి బాలా బాబాయ్! మీరు త్వరగా కోలుకొని, పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని మళ్లీ పూర్తి ఫామ్‌లో గర్జిస్తే చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను…”(“Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form…”)అంటూ ఎంతో ప్రేమతో, గౌరవంతో తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో క్షణాల్లో వైరల్ చేసేశారు అభిమానులు.

Advertisement

ఇక బాలయ్య ప్రమాదం విషయానికి వస్తే కాకినాడ పోర్ట్ లో ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK 111’ షూటింగ్ జరుగుతుంది.ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య స్వయంగా డూప్ లేకుండా రిస్కీ స్టంట్ చేస్తుండగా అకస్మాత్తుగా కాలు జారడంతో మోకాలికి బలమైన గాయమైంది. ప్రమాదాన్ని గమనించిన యూనిట్ సిబ్బంది వెంటనే స్పందించి, ఆయనను తక్షణ చికిత్స నిమిత్తం కాకినాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఇక బాలయ్య గాయపడి ఆస్పత్రిలో చేరాడు అని తెలీడంతో బాలయ్య అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.అయితే బాలయ్యని చూసిన డాక్టర్స్ ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే అని చెప్పినట్టు తెలుస్తుంది.

ఇక తారక్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాని చేస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాని వచ్చే ఏడు అంటే జూన్ 11, 2027న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు కూడా. మొత్తానికి బాబాయ్, అబ్బాయ్ ల మధ్య బంధం ఉప్పు నిప్పుగా ఉందని అనుకుంటున్న ఈ తరుణంలో తారక్ ఇలా బాబాయ్ ని ఉద్దేశించి పోస్ట్ పెట్టడంతో మురిసిపోతున్నారు నందమూరి అభిమానులు !

Advertisement

Related News

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

Big Stories

Advertisement
×