Julie Allegations :తమిళనాడు పాలిటిక్స్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. మొన్నటిదాకా తనదైన మాస్ యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దళపతి జోసెఫ్ విజయ్.. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కేసి సీయంగా బిజీ అయిపోయారు..ఆయన పెట్టిన ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ రీసెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వన్-సైడ్ వేవ్‌తో దూసుకెళ్లి అధికారంలోకి వచ్చింది. విజయ్ సీఎం కాగానే తన సింప్లిసిటీతో అందరి మనసుల్ని దోచుకుంటున్నాడు అనుకుంటున్న టైమ్ లో టైంలో.. కోలీవుడ్ నుంచి ఒక ఊహించని బాంబ్ పేలింది. యస్ ..బుల్లితెర నటి జూలీ చేసిన సెన్సేషన్ కామెంట్స్ ఇప్పుడు అటు సోషల్ మీడియాను ఇటు పొలిటికల్ సర్కిల్స్ ఒక రేంజ్‌లో షేక్ చేస్తున్నాయి.
అసలేం జరిగిందంటే
వివరాల్లోకి వెళితే, తమిళ బుల్లితెర ప్రేక్షకులకు జల్లికట్టు ఉద్యమం ద్వారా ఫేమస్ అయిన బిగ్ బాస్ ఫేమ్ జూలియా రిచర్డ్సన్ (జూలీ) కి, విజయ్ ఫ్యాన్స్‌కి మధ్య చాలా రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల టైంలో జూలీ ఓపెన్‌గా విజయ్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తే జరిగే నష్టాలంటూ గట్టిగానే వాయిస్ రేజ్ చేశారు. ఇక అంతే.. దళపతి ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు తెరతీశారు. కానీ, ఆ ట్రోల్స్ కాస్తా హద్దులు దాటి పర్సనల్ ఎటాక్స్ లాగా మారిపోయాయి. రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జూలీ ఈ విషయాలన్నీ చెప్తూ ఎమోషనల్ అయిపోయికన్నీళ్లు పెట్టుకున్నారు.
15 లక్షల కిడ్నీ స్కామ్ లో జూలీ
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న సైబర్ దాడి వల్ల మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విజయ్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్స్ ‘మెర్సల్’, ‘సర్కార్’, ‘మాస్టర్’ వంటి సినిమాల్లో సమాజంలోని అవినీతిపై పోరాడే పాత్రలు చేసిన విజయ్, నిజ జీవితంలో తన అభిమానుల అరాచకాలను ఎందుకు అడ్డుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ ట్రోలింగ్ ఎంతవరకు వెళ్ళిందంటే, ఆమెపై ఏకంగా 15 లక్షల రూపాయల కిడ్నీ స్కామ్ ఆరోపణలు మోపారు. ఎలాగైనా ఆమెను ఒక తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపాలని విజయ్ ఫ్యాన్స్ కుట్రలు పన్నారని జూలీ ఆరోపించారు.
విజయ్ కారణంగానే బిడ్డని కోల్పోయా
ఈ వేధింపులు భరించలేక ఆమె గత మార్చి నెలలోనే చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులకు కొందరి పేర్లతో సహా లిఖితపూర్వక ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ ట్రోలర్స్ వెనక్కి తగ్గకపోగా, మరింత రెచ్చిపోయి అసభ్యకరమైన కామెంట్స్ చేయడం కొనసాగించారు. ఈ క్రమంలోనే జూలీ ఒక గుండెలు పిండేసే నిజాన్ని బయటపెట్టారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిరంతర వేధింపుల కారణంగా తాను గర్భవతి అనే విషయాన్ని కూడా సంతోషంగా ఆస్వాదించలేకపోయానని, చివరకు తన కడుపులోనే శిశువు చనిపోయిందని ఆమె సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఒక రకంగా ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా తన బిడ్డ మరణానికి సీఎం విజయ్, ఆయన అభిమానుల వేధింపులే కారణమని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట మంటలు రేపుతున్నాయి. ఒక మహిళ అబార్షన్ కి గురయ్యేలా చేయడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనా అంటూ పలువురు సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
విజయ్ కి ఎలాంటి చిక్కులు తెచ్చిపెడతాయో
ఏది ఏమైనా సీఎం హోదాలో ఉన్న విజయ్ ని ఈ కాంట్రవర్సీ చుట్టుముట్టడం పొలిటికల్ గా కాస్త ఇబ్బందనే చెప్పాలి. విజయ్ సీఎం అయ్యాక మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు కూడా. మరి సొంత అభిమానుల వల్ల ఒక మహిళ, అందులోనూ సెలబ్రిటీ అయిన నటి ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది అనడంపై నూతన ముఖ్యమంత్రి విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వ్యవహారంపై అధికార పార్టీ టీవీకే శ్రేణులు గానీ, సీఎం కార్యాలయం గానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ చేయకపోవడం గమనార్హం. చూడాలి మరి ముందు ముందు జూలీ చేసిన ఈ కామెంట్స్ విజయ్ కి ఎలాంటి చిక్కులు తెచ్చిపెడతాయో !
also read :పవన్ కళ్యాణ్ 500 కోట్ల ‘కోడి చెరువు’ కబ్జా చేశాడా?… పెయిడ్ బ్యాచ్‌కి మైండ్ బ్లాక్ కౌంటర్!