E-Paper
Advertisement

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?
Advertisement

Tollywood: 2024 సంవత్సరం న్యూఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి తెలుగు చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏకంగా తొమ్మిది పురస్కారాలను తెలుగు సినిమా దక్కించుకుంది. స్టార్ హీరోలు నటించిన భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు విభిన్నమైన కంటెంట్ తో వచ్చిన చిన్న చిత్రాలకి కూడా ఈ అవార్డులు లభించాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తమ బాలల చిత్రంగా ’35: చిన్న కథ కాదు’ చిత్రం కూడా ఏకంగా రెండు నేషనల్ అవార్డులకి ఎంపికవడం అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ఉత్తమ బాలల చిత్రంగా 35: చిన్న కథ కాదు..

నంద కిషోర్ ఇమాని దర్శకత్వంలో.. నివేదా థామస్ రీ ఎంట్రీలో విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో 2024 సెప్టెంబర్ 5న విడుదలైన చిత్రం 35: చిన్న కథ కాదు. రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్, వాల్టేయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సృజన్ యర్రబోలు, సిద్ధార్థ రాళ్లపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే అలాంటి ఈ సినిమా ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ లో మెరిసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారం అందుకోవడమే కాకుండా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ పోతులకి కూడా ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డు లభించడం గమనార్హం.

నేషనల్ అవార్డు అందుకున్న తొలి ఉత్తమ బాలల చిత్రం..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి అవార్డు లభించడంతో టాలీవుడ్ లో గతంలో ఏ చిత్రానికి మొదట ఉత్తమ బాలల చిత్రం విభాగంలో నేషనల్ అవార్డు వచ్చింది అని నెటిజన్స్ కూడా ఆరా తీస్తున్నారు. అలా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలిసారి ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం జూనియర్ ఎన్టీఆర్ ‘బాల రామాయణం’. గుణశేఖర్ దర్శకత్వంలో మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్ర పోషించారు. 1996లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లోనే ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డును అందుకుంది రికార్డు సృష్టించింది. ఇక దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ అదే విభాగంలో 35: చిన్న కథ కాదు సినిమా కూడా ఈ పురస్కారాన్ని అందుకొని రెండవ చిత్రంగా నిలిచింది.

3000 మందికి పైగా బాల కళాకారులు..

ఇకపోతే బాల రామాయణం చిత్రం ద్వారానే జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. పైగా శ్రీరామునిగా ఆయన నటనకు విశేష ప్రశంసలు లభించాయి. ఇక ఇందులో సీత పాత్రలో స్మిత మాధవన్ నటించారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. రాముడు, రావణుడితో సహా అన్ని పాత్రలను కలుపుకొని సుమారుగా మూడు వేల మందికి పైగా బాల కళాకారులు ఈ చిత్రంలో నటించారు. ఉత్తమ బాలల చిత్రం విభాగంలో నేషనల్ అవార్డు అందుకోవడమే కాకుండా ఇందులో రావణుడి పాత్ర పోషించిన స్వాతి కొడాలికి ఉత్తమ బాలనటిగా నంది అవార్డు కూడా లభించింది. ఈ సినిమా పిల్లల సినిమానే అయినప్పటికీ.. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ సెట్, విజువల్ ఎఫెక్ట్ లతో ప్రాచీన ఇతిహాసానికి జీవం పోశారు. ఈ చిత్రానికి మాధవపెద్ది సురేష్ , ఎల్ వైద్యనాథన్ సంగీతం అందించారు.

Advertisement

also read:నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఎన్టీఆర్ ప్రశంసలు..

టాలీవుడ్ కి ఏకంగా తొమ్మిది నేషనల్ అవార్డ్స్ లభించడంతో పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలియజేశారు. “72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. జాతీయ వేదికపై తెలుగు సినిమా మెరుస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నాగ భూషణ్ , స్వప్న దత్, ప్రియాంక దత్, కల్కి 2898AD చిత్ర బృందానికి, సుకుమార్ , పుష్ప2 టీమ్ కి, నిహారిక కొణిదెల, యదు వంశీ , కమిటీ కుర్రోళ్ళు మూవీ తో పాటూ 35 చిన్న కథ కాదు సినిమా రెండు అవార్డులను గెలుచుకుంది. లక్కీ భాస్కర్ మూవీ కి బెస్ట్ డైలాగ్స్ అవార్డు అందుకున్న వెంకీ అట్లూరీకి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ పోస్ట్ చేశారు.

కృతజ్ఞతలు తెలిపిన నిర్మాత సృజన్..

అయితే ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ కి 35 చిన్న కథ కాదు నిర్మాత సృజన్ యర్రబోలు స్పందిస్తూ.. “టార్చ్ బేరర్ తారక్ సార్.. మీ అభినందనలకు మేము ఎంతో సంతోషిస్తున్నాం.. మీరు నటించిన బాల రామాయణం తర్వాత ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును అందుకున్న రెండవ తెలుగు సినిమాగా 35 చిన్న కథ కాదు మూవీ నిలవడం మాకు గర్వకారణం .ఈ సమయంలో మీ నుంచి ఇలాంటి అభినందనలు అందుకోవడం ఈ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది” అంటూ పేర్కొన్నారు.

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×