Jyotirmayee Nayak:జ్యోతిర్మయి నాయక్..జ్యోతిర్మయి నాయక్..జ్యోతిర్మయి నాయక్..ఇప్పుడీ పేరు దేశమంతా మారుమ్రోగి పోతుంది.కారణం ఇండియన్ ఐడల్ సీజన్ 16 విన్నర్‌గా నిలవడమే.అవును..నిన్న రాత్రి జరిగిన గ్రాండ్‌గా జరిగిన ఫినాలేలో విన్నర్ గా ట్రోఫీని గెలుచుకుంది .జ్యోతిర్మయి.ఇక ఈ టైటిల్ తో పాటు రూ. 20 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా ఆమె సాధించడం విశేషం.ఐతే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆ అమ్మాయి ఒడిశా నుండి రావడం.అవును..ఇప్పటి వరకు ఒడిశా నుండి ఎవరూ ఇండియన్ ఐడల్ చరిత్రలో టైటిల్ గెలవలేదు మరి. ఫైనల్లో తనిష్క్ శుక్లా, అన్షికా చోంకర్, మన్‌రాజ్ వీర్ సింగ్, మైస్క్‌మ్ బోసు, సుహైల్ సూఫీ లాంటి సత్తా ఉన్న సింగర్స్ గట్టి కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ వారిని దాటుకొని అందరిని తన పాటలతో మెప్పించి కప్పు పట్టేసింది జ్యోతిర్మయి నాయక్.
జ్యోతిర్మయి నాయక్ విషయానికి వస్తే
ఇక 25 ఏళ్ల జ్యోతిర్మయి నాయక్ విషయానికి వస్తే తను పుట్టి పెరిగింది ఓడిశా లోని రూర్కెలాలో.ఆమె కేవలం సింగర్ మాత్రమే కాదండోయ్ ఒక క్వాలిఫైడ్ మ్యూజిక్ థెరపిస్ట్ కూడా. అంటే మ్యూజిక్ ద్వారా మనుషుల మైండ్ రిలాక్స్ చేయడం, డిప్రెషన్ లాంటి సమస్యలు తగ్గించడంలో ఆమె ట్రైనింగ్ తీసుకుందన్న మాట.ఇక జ్యోతిర్మయి టాలెంట్ కి తోడు నాన్న చక్రధర్ నాయక్, అమ్మ గౌరీ నాయక్ కు ఎంతగానో సపోర్ట్ చేశారు. చిన్నప్పటి నుంచే ఆమెలో ఉన్న సింగింగ్ టాలెంట్ చూసి వాళ్ల నాన్నే ఆమెను బాగా ఎంకరేజ్ చేశారు.
also read :ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్….రూ.2000 కోట్ల రికార్డు కొట్టేది ఈ హీరోనేనా?
మ్యూజిక్ విషయానికొస్తే
ఇక ఇండియన్ ఐడల్ సీజన్ 16 విన్నర్‌గా నిలిచిన జ్యోతిర్మయి చదువు విషయానికి వస్తే.. భువనేశ్వర్‌లోని KIIT కాలేజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత చెన్నై వెళ్లి మ్యూజిక్ థెరపీ కోర్స్ చేసింది. మ్యూజిక్ విషయానికొస్తే, మూడో తరగతిలోనే రూర్కెలాలో బుద్ధ ప్రసాద్ రావు దగ్గర క్లాసికల్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కుటుంబం భువనేశ్వర్ షిఫ్ట్ అయ్యాక బాలకృష్ణ భైరా దగ్గర శిక్షణ అలాగే కొనసాగించింది. బాలీవుడ్ పాటల కోసం శారదా ప్రసన్న సాహు దగ్గర మెళకువలు కూడా నేర్చుకోవడం విశేషం.
మొదటిగా ఎ సినిమాలో తన గొంతుని పలికిస్తుందో
అయితే ఆయన 2023లో చనిపోయినా, “పాటలు ఊరికే పాడటం కాదు, భావాలు శ్రోతలకు తగిలేలా ఎలా పాడాలో ఆయనే నేర్పించారు” అని ఆమె తన గురువుని గుర్తు చేసుకుంది కూడా.ఇక ఇండియన్ ఐడల్ టైటిల్ గెలవడం తనకు ఒక కలలా ఉందని,ఫ్యూచర్‌లో అలియా భట్, దీపికా పదుకొణె లాంటి పెద్ద స్టార్లకు ప్లేబ్యాక్ సింగర్‌గా పాడాలనేదే తన మెయిన్ డ్రీమ్ అని మనసులోని మాటని చెప్పింది. ఈ మధ్య కాలంలో సినిమాల్లో పాటలకు మరింత ఇంపార్టెన్స్ దక్కుతుండటంతో ఇండియన్ ఐడల్ సీజన్ 16 విన్నర్‌గా నిలిచిన జ్యోతిర్మయి వచ్చే రోజుల్లో ఇండియన్ ఇండస్ట్రీలో పాగా వేసేలానే కనిపిస్తుంది.చూడాలి మరి భారీ అంచనాలని మోస్తున్న జ్యోతిర్మయి మొదటిగా ఎ సినిమాలో తన గొంతుని పలికిస్తుందో !