2000 Crore:ఘరానా మొగుడు..టాలీవుడ్ లో తొలిసారి పదికోట్లు కొల్లగొట్టిన సినిమా.ఆ కలెక్షన్స్ కే తెగ షేక్ అయిపొయింది టాలీవుడ్.అసలు కనీ వినీ ఎరుగని వసూల్లంటూ క్లౌడ్ నైన్ లో తేలిపోయింది. ఇక చాలా ఏళ్ళకి పోకిరి 40 కోట్లు వెనకేస్తే టాలీవుడ్ రికార్డులని తిరగరాసిన సినిమా అని, అసలు ఇంతటి వసూళ్లు తెలుగు సినిమాకి సాధ్యమేనా అంటూ కళ్ళు తేలేసింది.కానీ కాలం మారింది.వసూళ్ళ సునామిని వంద కోట్లకి చేర్చింది మగధీర.ఇక అప్పటి నుండి వంద కోట్లు దాటి వందల కోట్ల వైపు ప్రయాణాన్ని మొదలెట్టింది మన టాలీవుడ్.
అలా బాహుబలి ది బిగినింగ్ సినిమాతో తొలిసారి 500కోట్ల వసూల్లని చూసింది తెలుగు సినిమా.ఇక బాహుబలి ది కన్క్లూజన్ తో ఏకంగా 1800 కోట్ల వసూళ్ళని సాధించిన టాలీవుడ్ ప్యాన్ వరల్డ్ స్థాయిలో మారుమ్రోగిపోయింది. ఇక ఆ బాటలోనే వెయ్యి కోట్లు మాకు వెరీ కామన్ అంటూ RRR, కల్కి2898AD, పుష్ప2 సినిమాలు వెయ్యి కోట్ల కాంపౌండ్ లోకి ఈజీగా దూకేశాయి.ముఖ్యంగా పుష్ప2 1800కోట్లు కొల్లగొట్టడం ఒక సంచలనం.అత్యధిక వసూళ్ళు చూసిన దభాంగ్ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ సినిమా ఇదే కావడంతో బన్నీ పేరు వరల్డ్ వైడ్ గా మారుమ్రోగిపోయింది.
గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వస్తున్న వారణాసి
దీంతో ఇప్పుడిక 2000వేల కోట్లు ఎవరు కొడతారంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు మూవీ లవర్స్.అయితే ఈ కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చే వారు మాత్రం దరిదాపుల్లో ముగ్గురే కనిపిస్తున్నారు.వారిలో మొదటగా కనిపిస్తుంది.జక్కన్న – మహేశ్ బాబు ల కాంబో.గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వస్తున్న వారణాసికి ఈ క్లబ్ లో చేరే దమ్ము ఉంది అంటూ అంచనా వేస్తున్నారు అంతా. జక్కన్న సినిమా కోసం చేసిన క్యాస్టింగ్, వరల్డ్ వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్న తీరు, సినిమాలో ఎంచుకున్న కంటెంట్ ..ఇలా ప్రతీదీ భారీ వసూల్లకి గురిపెట్టేదే. ఒకరకంగా చెప్పాలంటే 2027 ఏప్రిల్ 27 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపైనే అందరికి అంచనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. కారణం వెయ్యి కోట్ల క్లబ్ లో రాజమౌళివే రెండు సినిమాలున్నాయి మరి.అన్నీ అనుకూలిస్తే మహేష్ బాబే తొలిసారి రెండు వేల కోట్లని వెనకేసిన తొలి హీరో అయినా ఆశ్చర్యం లేదు.
ప్రభాస్,సందీప్ వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్
ఇక ఈ లిస్టులో ఉన్న మరో క్రేజీ కాంబో..ప్రభాస్,సందీప్ వంగా. వీరి కాంబోలో వస్తున్న స్పిరిట్ కూడా రెండు వేల కోట్ల క్లబ్ లో చేరే సినిమాగా లెక్కలేస్తున్నారు ట్రేడ్ పండితులు.కారణం యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా 900 కోట్లు కొల్లగొట్టడం,అలాగే ప్రభాస్ ఖాతాలో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉండటం, అలాగే స్పిరిట్ సినిమా కోసం సందీప్ ఏకంగా ఫ్యాన్ వరల్డ్ స్టార్స్ ని బరిలోకి దిన్చుతుండటం తో ఈ సినిమా కూడా రెండువేల కోట్లకి గురి పెట్టినట్టే కనిపిస్తుంది.అయితే సినిమాలో ఎక్కువగా బ్లడ్ బాత్ ఉండేలా కనిపిస్తుంది ,మరి ఇది అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తుందో చూడాలి.
ప్రశాంత్ నీల్,ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’
ఇక ఈ లిస్టు లో కనిపిస్తున్న మరో జోడీ ప్రశాంత్ నీల్,ఎన్టీఆర్.వీరి కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ (NTR31)పై అంచనాలు భారీగానే ఉన్నాయి.హై-వోల్టేజ్ యాక్షన్, పవర్‌ఫుల్ ఎమోషన్స్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ 2027 జూన్ 11 2027న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు కూడా. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్, ఎన్టీఆర్ ఎనర్జీ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర రెండు వేల కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఇప్పటికే RRRసినిమాతో వెయ్యి కోట్ల క్లబ్ లో తారక్ చేరగా KGF2 తో నీల్ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లోకి దూకిన వాడే. అలాగే ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’ కూడా ఈ బెంచ్ మార్క్‌ను రీచ్ అయ్యే అవకాశాలే ఎక్కువ.
మహేష్ మొదటగా ఈ క్లబ్ లోకి దూకేస్తాడా ?
వీరితో పాటు పుష్ప 2తో పాన్ వరల్డ్ స్థాయిని టచ్ చేసిన అల్లు అర్జున్ – అట్లీ సినిమా రాకా కి, 2898 AD పార్ట్ 2తో రాబోతున్న నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబోలు కూడా ఈ క్లబ్ లో నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ఒక రకంగా చూస్తె వచ్చే మూడు, నాలుగు ఏళ్ళల్లో ఈజీగా ఒక రెండు మూడు సినిమాలు రెండు వేల కోట్ల క్లబ్ లోకి దూకడం ఖాయంగానే కనిపిస్తుంది. చూడాలి మరి టార్చ్ బేరర్ లా కనిపిస్తున్న మహేష్ మొదటగా ఈ క్లబ్ లోకి దూకేస్తాడో లేదా మరే హీరో ఎవరైనా స్పీడ్ గా ఎంట్రీ ఇచ్చేశాడో !
also read:‘చెన్నై లవ్ స్టోరీ’కి రూ.కోటి రూపాయల ఫ్రీ టికెట్లు?ఏంటిది కిరణ్?