E-Paper
Advertisement

Kaantha First Spark: దుల్కర్ కాంత.. చాలా గట్టిగానే ఉండబోతున్నట్టుందే

Kaantha First Spark: దుల్కర్ కాంత.. చాలా గట్టిగానే ఉండబోతున్నట్టుందే
Advertisement

Kaantha First Spark: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.  తెలుగు,తమిళ్ మలయాళం, హిందీ  అనే తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు. దుల్కర్  ఈ ఏడాది హీరోగా ప్రేక్షకులను అలరించలేకపోయినా నిర్మాతగా మాత్రం పారి విజయాన్ని అందుకున్నాడు. ఆయన నిర్మించిన లోక చాప్టర్ 1 చంద్ర భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.  అందులో ఒక చిన్న పాత్రలో కనిపించి కనువిందు చేశాడు.

ఇక దుల్కర్ నుంచి వస్తున్న మరో చిత్రం కాంత. ఆయనే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక దుల్కర్ తో పాటు ఈ సినిమా నిర్మాణంలో రానా దగ్గుబాటి కూడా చేతులు కలిపాడు. కాంత సినిమాలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నాడు.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది.

Advertisement

అన్ని బానే ఉంటే ఈపాటికి కాంత ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది. కానీ కొన్ని కారణాలవల్ల నవంబర్ 14 కి వాయిదా పడింది. ఇక  రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన కాంత టీమ్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ కాంత ఫస్ట్ స్పార్క్ అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు.

ట్రైలర్ లో కొన్ని షాట్స్ ను కట్ చేస్తూ కథను చెప్పడానికి ట్రై చేశారు. ఈ సినిమా కూడా పీరియాడిక్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలోఒక సినిమా హీరోగా దుల్కర్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా భాగ్యశ్రీ కనిపించగా.. డైరెక్టర్ గా సముద్రఖని కనిపించాడు. హీరోకు, డైరెక్టర్ కి మధ్య జరిగిన వివాదాల సారాంశమే కాంత సినిమా అని తెలుస్తోంది.  ఇద్దరు ఉద్దండ పండితుల మధ్య ఈగో క్లాష్ వస్తే ఎలా ఉంటుంది. అలాగే  సినిమా అనేది హీరో వలన  హిట్ అవుతుందా.. డైరెక్టర్ వలన హిట్ అవుతుందా అనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను నవంబర్ 6 న రిలీజ్ కానున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×