E-Paper
Advertisement

Kajal Aggarwal: ఒళ్లంత తుళ్లింత అయ్యేలా.. బీచ్ ఒడ్డున చందమామ హొయలు

Kajal Aggarwal: ఒళ్లంత తుళ్లింత అయ్యేలా.. బీచ్ ఒడ్డున చందమామ హొయలు
Advertisement

Kajal Aggarwal: లక్ష్మీ కళ్యాణం  సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతోనే తెలుగింటి ఆడపిల్లలాగా కుర్రకారును అలరించిన కాజల్.. చందమామ సినిమాతో అచ్చ తెలుగు ఆడపడుచులాగా మారిపోయింది. చందమామ ఇచ్చిన హిట్ తర్వాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక మగధీర సినిమాతో అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత సీనియర్, జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరితోనూ నటించి మెప్పించింది. ఇప్పుడంటే కుర్ర హీరోయిన్లు రోజుకొకరు పరిచయం అవుతున్నారు. కానీ, అప్పట్లో అన్ని సినిమాలకు మొదటి ఛాయిస్ కాజల్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

మెగా ఫ్యామిలీ మొత్తాన్ని కవర్ చేసిన ఏకైక హీరోయిన్ అంటే కాజల్ అనే చెప్పొచ్చు. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లూను  ప్రేమించి పెళ్లి చేసుకుంది. సాధారణంగా పెళ్లయిన తర్వాత హీరోయిన్లకు లైఫ్ ఉండదు అని మాట్లాడుకుంటారు. కానీ కాజల్ ఒక బిడ్డకు తల్లి అయ్యాక కూడా తన సత్తా చాటుతుంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క ఫ్యామిలీ ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఎంతోమంది హీరోయిన్స్ కు  ఆదర్శంగా నిలుస్తుంది.

Advertisement

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సంసార సాగరంలో ఆనందాన్ని అనుభవిస్తుంది. భర్త, కొడుకు, కుటుంబం వారితోనే సరదాగా సమయాన్ని గడిపేస్తుంది. తల్లి అయ్యాక ప్రతి మహిళలో మార్పులు అనేవి సహజం. కానీ, కాజల్ అందం ఇసుమంతైన తగ్గలేదు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇప్పటికీ ఆమె అదే అందంతో అభిమానులను అలరిస్తుంది. నిత్యం ఆమె గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా కాజల్ తన కుటుంబంతో గడిపిన వెకేషన్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

ఈ మధ్యనే చందమామ కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా చెక్కేసింది. అక్కడ భర్త గౌతమ్, కొడుకు నీల్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ముఖ్యంగా బీచ్ ఒడ్డున రెడ్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో ఒళ్లంత తుళ్ళింత అనేలా ఎగురుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలకు ఆమె మరింత అద్భుతమైన క్యాప్షన్ కూడా జోడించింది.

Advertisement

” గోల్డ్ కోస్ట్.. క్వీన్ లాండ్స్ లో చాలా గొప్పగా సమయం గడిచింది. సూర్యుడు, సర్ఫ్ఫింగ్, చుట్టూ చిరునవ్వులు.. ఎంతో అందమైన బీచ్.. అద్భుతమైన లేన్ ల నుండి హాయిగా ఉండే కేఫ్ ల వరకు  ప్రతిక్షణం ఒక పోస్ట్ కార్డులా  అనిపించింది. ఇక్కడ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా చూశాను. దేవుడి దయవల్ల ఇండియా గెలిచింది. నిజంగా ఇది ఒక అత్యుత్తమ అనుభవాలలో ఒకటి “అంటూ రాసుకోచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక చివరగా కాజల్.. మంచు విష్ణు నటించిన కన్నప్ప  సినిమాలో కనిపించింది. త్వరలోనే ఆమె నుంచి ఒక ప్రాజెక్ట్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×