E-Paper
Advertisement

Kalyani Priyadarshan: హిందీ అరంగేట్రంపై చంద్ర క్లారిటీ.. ఆసక్తి ఉన్నా అవకాశం లేదంటూ!

Kalyani Priyadarshan: హిందీ అరంగేట్రంపై చంద్ర క్లారిటీ.. ఆసక్తి ఉన్నా అవకాశం లేదంటూ!
Advertisement

Kalyani Priyadarshan:ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమా ట్రెండ్ వచ్చేసిన నేపథ్యంలో హీరోలను మొదలుకొని హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రాంతీయంగా సినిమాలు చేసి సక్సెస్ కొట్టిన హీరోయిన్లు.. సౌత్ లో భారీగా క్రేజ్ దక్కించుకున్న తర్వాత అటు బాలీవుడ్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీ నుంచి శ్రీలీల, కృతి శెట్టి లాంటి యంగ్ హీరోయిన్లతో పాటు ఇప్పుడు ఈ జాబితాలోకి మరో బ్యూటీ కూడా వచ్చే చేరింది.

తొలి హీరోయిన్గా అలాంటి రికార్డ్..

ఆమె ఎవరో కాదు కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan). అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా వచ్చిన ‘హలో’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి.. ‘లోక: చాప్టర్ వన్ చంద్ర’ అనే మలయాళం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ‘కొత్తలోక’ అంటూ తెలుగులో డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకొని పాన్ ఇండియా స్థాయిలో కళ్యాణికి గుర్తింపు అందించింది. అంతేకాదు ఈ ఒక్క సినిమాతో ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఫ్యాన్ బేస్ పెరిగిపోయిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సూపర్ హీరో కాన్సెప్టులో సినిమా చేసిన తొలి హీరోయిన్గా కూడా కళ్యాణి రికార్డు సృష్టించింది.

బాలీవుడ్ ఎంట్రీ పై కళ్యాణి క్లారిటీ..

Advertisement

అలాంటి ఈమె ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పై దృష్టి సారిస్తూనే.. మరోవైపు జీనీ , మార్షల్ లాంటి ప్రాజెక్టులలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చింది కళ్యాణి ప్రియదర్శన్. విషయంలోకి వెళ్తే.. రణ్ వీర్ సింగ్ నటిస్తున్న ‘ప్రలే’ సినిమాతో కళ్యాణి హిందీ అరంగేట్రం చేస్తోంది అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. “నాకు బాలీవుడ్ పై ఆసక్తి ఉంది. కానీ ఇప్పటివరకు ఏ హిందీ సినిమాకి కూడా నేను ఒప్పుకోలేదు. ముఖ్యంగా సినిమాలో నేను నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం లేదు. నిజానికి నాకు బాలీవుడ్ లో నటించాలని ఆసక్తి ఉన్నా.. ప్రస్తుతం వరుస సినిమాల కారణంగా ఇప్పుడు నటించే అవకాశం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చింది.

ALSO READ:Varanasi: మహేష్ ఫ్యాన్స్ కి షాక్.. హీరోకు మించి మరో పాత్ర!

బలమైన పాత్ర దొరికితే అరంగేట్రం పక్కా..

Advertisement

అలాగే ఆమె మాట్లాడుతూ.. సరైన స్క్రిప్ట్ దొరికితే, బలమైన క్యారెక్టర్ లభిస్తే ఖచ్చితంగా చేస్తానని, అయితే తొందరపడి సినిమాలు చేసే ఆలోచన తనకు లేదు అంటూ వెల్లడించింది. ఏది ఏమైనా కళ్యాణి ప్రస్తుతం తన చేతుల్లో ఉన్న ప్రాజెక్టులపైనే పూర్తి ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరి ఇవన్నీ గనుక మంచి సక్సెస్ లభిస్తే మాత్రం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనడంలో సందేహం లేదు.
ఇక ఆచితూచి అడుగులు వేస్తున్న కళ్యాణికి ఈ సినిమాలన్నీ ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×