E-Paper
Advertisement

ISRO: పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం విఫలం.. నాలుగో దశలో సమస్య, విశ్లేషణ మొదలు-ఇస్రో ఛైర్మన్

ISRO: పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం విఫలం.. నాలుగో దశలో సమస్య, విశ్లేషణ మొదలు-ఇస్రో ఛైర్మన్
Advertisement

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. మూడో దశ వరకు రాకెట్ ప్రయోగం సాఫీగా సాగింది. నాలుగో దశలో సమస్య మొదలైంది. ఈ సమస్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు. దీంతో డేటాను విశ్లేషించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు.

పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం విఫలం

Advertisement

ఇస్రోకు తురుపు ముక్క పీఎస్‌ఎల్‌వీ రాకెట్. ఇప్పటివరకు 63 ప్రయోగాల్లో 60 విజయవంతం సక్సెస్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే పీఎస్ఎల్వీ రాకెట్ సక్సెస్ 99.9 శాతం అన్నమాట. తాజాగా కొత్త ఏడాది 2026, జనవరి 12న ఉదయం 10.18 నిమిషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచిపీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

Advertisement

రాకెట్ ప్రయోగం మూడు దశల వరకు సాఫీగా సాగింది. నాలుగో దశలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో అంతరాయం ఏర్పడినట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. పరిస్థితి విశ్లేషణ చేస్తున్నట్లు వెల్లడించారు. 4వ దశ ప్రారంభంలో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయాయి. సాంకేతిక లోపం తలెత్తినట్టు అధికారులు భావిస్తున్నారు. 

నాలుగో దశలో సమస్య, ఇస్రో ఛైర్మన్ ప్రకటన

భారత్‌కి చెందిన ఈఓఎస్‌-ఎన్‌1 ఉపగ్రహంతోపాటు యూకె, థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్‌ వంటి దేశాలకు చెందిన 14 ఉపగ్రహాలు మోసుకెళ్లింది పీఎస్ఎల్‌వీ రాకెట్. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే సమయంలో అంతరాయం ఏర్పడింది. కొత్త ఏడాదిలో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఫెయిల్ కావడంతో శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు.

దేశ రక్షణ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన ఈఓఎస్‌-ఎన్‌1 అన్వేష ఉపగ్రహం. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ చేపట్టిన తొమ్మిదవ వాణిజ్య మిషన్‌. ఈఓఎస్‌-ఎన్‌1 ఉపగ్రహం దేశంలో వ్యవసాయం, సిటీ మ్యాపింగ్, పర్యావరణ పర్యవేక్షణ,  సరిహద్దుల్లో నిఘా వంటి వాటి కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

ALSO READ:  మీ యూట్యూబ్ ఛానెల్ వ్యూస్ పెరగడం లేదా?  ఈ టిప్స్ తప్పనిసరిగా పాటించండి?

PSLV ఇటీవలకాలంలో రెండో వైఫల్యం ఇది. గతేడాది మే 18న శ్రీహరికోట నుండి ప్రయోగించిన కొన్ని నిమిషాల తర్వాత PSLV రాకెట్‌లో సమస్యలు తలెత్తడంతో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో విఫలమైంది. ఆ మిషన్ ఇస్రోకు 101వది. ప్రయోగం తర్వాత 12వ నిమిషంలో అసాధారణ పరిస్థితి మొదలైంది. ఫలితంగా ఆ ప్రయోగం విఫలమైంది. దాదాపు ఏడు నెలల వ్యవధిలో ఇది రెండోది.   PSLV రాకెట్ చరిత్రలో ఇది నాలుగో రాకెట్ ప్రయోగం విఫలమైంది. 

 

Related News

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

Big Stories

Advertisement
×