E-Paper
Advertisement

Ranveer Singh: కాంతార పై రణవీర్ సింగ్ కామెంట్స్… క్షమాపణలు డిమాండ్ చేస్తున్న కన్నడిగులు!

Ranveer Singh: కాంతార పై రణవీర్ సింగ్ కామెంట్స్… క్షమాపణలు డిమాండ్ చేస్తున్న కన్నడిగులు!
Advertisement

Ranveer Singh: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు రణవీర్ సింగ్(Ranveer Singh) గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా నటుడు రణవీర్ సింగ్ వివాదాలలో చిక్కుకున్నారు. ముఖ్యంగా కన్నడ సినీ అభిమానులు ప్రేక్షకులు రణవీర్ సింగ్ పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన వెంటనే కన్నడ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు కన్నడ ప్రేక్షకులు రణవీర్ సింగ్ పట్ల ఇలాంటి డిమాండ్ చేయడానికి గల కారణాలు ఏంటి అసలేం జరిగిందనే విషయానికి వస్తే..

ఓ.. అనే శబ్దాన్ని అవమానించిన రణవీర్..

ఇటీవల గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) అవార్డు వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకలలో భాగంగా రణవీర్ సింగ్ కాంతార (Kantara) సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఇక ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడిన రణవీర్ సింగ్ ఈ సినిమాలో పంజుర్లీ దేవత ప్రవేశించిన సమయంలో ఓ.. అనే శబ్దాన్ని ఈయన స్టేజ్ పై హాస్యాస్పదంగా చేసి చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రణవీర్ సింగ్ క్షమాపణలు చెప్పాల్సిందే..

Advertisement

కాంతార సినిమాలోని ఓ అనే గర్జనను కన్నడిగులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి శబ్దాన్ని రణవీర్ సింగ్ హాస్యాస్పదంగా తీసుకొని ఒక గొప్ప వేదికపై అవమానకరంగా మాట్లాడారని దీంతో వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వివాదంపై రణవీర్ సింగ్ స్పందిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇఫీ వేడుకలలో భాగంగా నటుడు రిషబ్ శెట్టి కూడా పాల్గొన్నారు. మరి ఈ విషయం పట్ల రిషబ్ శెట్టి స్పందన ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక రిషబ్ కన్నడ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంతార సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార చాప్టర్ వన్ సినిమా ద్వారా ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కన్నడ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ కాంతార యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు రిషబ్ శెట్టి వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also Read: Big tv Kissik Talks: ఐ బొమ్మ రవి పై శ్రీవాణి కామెంట్స్… హ్యాపీగా చూడొచ్చు కదా అంటూ!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×