E-Paper
Advertisement

AP Weather: దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

AP Weather: దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
Advertisement

AP Weather: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతు న్న దిత్వా తుపాను ఏపీ వైపు దూసుకొస్తోంది. ఈ తుపాన్ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమకు ప్రమాదం పొంచింది. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోన్న ఈ తుపాను కారైకల్‌కి 120 కి.మీ.. పుదుచ్చేరికి 220 కి.మీ, చైన్నైకి 330 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు-దక్షిణ ఏపీ తీరాలకు సమీపంగా ఇవాళ తెల్లవారుజామున తీరం దాటే చాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది.

దక్షిణ కోస్తాకు దిత్వా గండం
దిత్వా తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం వరకు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అత్యవసర సహాయక చర్యల కోసం కడపలో 2 NDRF బృందాలు, వెంకటగిరిలో 3 SDRF బృందాలు సిద్ధంగా ఉంచారు.

Advertisement

ఏపీలో రెండ్రోజుల పాటు కుండపోత వానలు..
ఇవాళ దిత్వా తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో జాతీయ విపత్తు నియంత్రణ బృందాలు రంగంలోకి దిగాయి.

ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..
తుపాను తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. దిత్వా తుపాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలకు ఎన్టీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు.

Advertisement

Also Read: శ్రీలంకను ఊడ్చిపడేసిన దిత్వా తుపాను.. వర్షాలు, వరదలతో 123 మంది మృతి

తెలంగాణపై స్వల్పంగా ‘దిత్వా’ తుపాన్ ఎఫెక్ట్..!
అలాగే తెలంగాణ వైపు కూడా దిత్వా తుఫాను ప్రభావం చూపుతోందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుపాన్ నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×