E-Paper
Advertisement

Rishab Shetty : కో స్టార్స్ తో రిషబ్ శెట్టి గొడవ..ఇదిగో అడ్డంగా దొరికిపోయాడుగా..!

Rishab Shetty : కో స్టార్స్ తో రిషబ్ శెట్టి గొడవ..ఇదిగో అడ్డంగా దొరికిపోయాడుగా..!
Advertisement

Rishab Shetty : కన్నడ స్టార్ హీరో శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. డైరెక్టర్ గా సినిమాలు చేసిన ఈయన కాంతారా మూవీ తో ఒక్కసారిగా హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలవడంతో ఆయన క్రేజ్ పెరిగింది. మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ కి సీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 మూవీ కూడా వచ్చింది. మొదటి పార్ట్ కంటే రెండవ పార్టు భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.. సినిమాల సంగతి పక్కన పెడితే రిషబ్ శెట్టి ఎప్పుడూ తనతో పాటు పనిచేసే యాక్టర్స్ తో గొడవలు పెట్టుకుంటాడంటూ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఈయన చేసిన ఒకే ఒక్క పని వల్ల ఆయన గొడవలు బయటపడ్డాయి.. ఇంతకీ ఈ హీరో చేసిన పనేంటో ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

హీరోయిన్ తో కన్నడ హీరో గొడవ..

కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న స్టార్ హీరో రిషబ్ శెట్టి.. ఈ హీరో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది.. తనతో పాటు నటించిన కో స్టార్స్ తో గొడవలు అయినట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న న్యూస్. కాంతారా చాప్టర్ 1 మూవీలో నటించిన హీరోయిన్ రుక్మిణి వసంత అలాగే కీలక పాత్రలో నటించిన రాజ్ బి శెట్టితో గొడవలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో ఓ న్యూస్ కోడై కూస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.. రుక్మిణి వసంత్ అలాగే రాజ్ బి శెట్టి ఇద్దరినీ హీరో రిషబ్ శెట్టి అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. దీనితో మరో సారి రిషబ్ శెట్టి హాట్ టాపిక్ గా మారాడు. అసలు ఎందుకు వీరిద్దరిని అన్ఫాలో చేశాడు అన్నది ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.. మిగిలిన యాక్టర్స్ తో గొడవలు ఉంటాయి కానీ హీరోయిన్ తో ఏం గొడవలు ఉంటాయి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపై హీరో రిషబ్ శెట్టి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Advertisement

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రేమ అవుట్..!

బడా నిర్మాణ సంస్థతో గొడవలు.. 

కేవలం తన కో యాక్టర్స్ తో మాత్రమే కాదు.. కొన్ని రోజుల కితమే నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారిని కూడా రిషబ్ అన్ ఫాలో చేసినట్లు తెలిసింది.. ఎందుకు ఈ హీరో ఇలా చేస్తున్నాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ కోల్డ్ వారి గురించి బయట ఎక్కడా రాలేదు కానీ.. వీళ్లలో వీళ్ళకి ఏమో సమస్యలు ఉన్నట్లు మాత్రం అర్థమవుతుంది. మరి ఈ గొడవలపై హీరో గారు నోరు విప్పుతారేమో చూడాలి. ఇక రిసెప్ట్ శెట్టి సినిమాల విషయానికొస్తే.. కాంతారా కు సీక్వెల్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే.. గతంలో వచ్చిన హనుమాన్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో హనుమాన్ పాత్రలో ఈయన నటిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వీలైనంత త్వరగా షూటింగ్ నీ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుందని సమాచారం.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×