E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు చూడబోయిన అపర్ణ  

Brahmamudi Serial Today march 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు చూడబోయిన అపర్ణ  
Advertisement

Brahmamudi serial today Episode: రాజ్‌ను చూసి షాకైన రేఖ వివరాలు అడుగుతుంది. పచ్చం రాజ్ బావలాగే ఉన్నాడని భయపడుతుంది. బస్తీ బతుకా అంటూ రాజును ఎద్దేవా చేస్తుంది. రాజుకు కోపం వస్తుంది. లక్కీ తన ప్రేమ కోసం కూల్‌గా ఉండమని చెప్తాడు. రాజు సైలెంట్‌ అవుతాడు. ఇక రెండో నెక్లెస్‌ ఎక్కడని రేఖ నిలదీయగా అప్పుడే స్వాతి నాకు తెలుసు అంటూ రెండో నెక్లెస్‌ చూపిస్తుంది. అది చూసిన భ్రమరాంబ షాక్‌ అవుతుంది. తన రూంలో దాచిన నెక్లెస్ దీనికెలా దొరికింది..అనుకుంటూ. తన పేరు భయటకు చెప్తుదేమోనని మనసులో భయపడుతుంది భ్రమరాంబ.

ఇంతలో రేఖ కోపంగా ఈ నెక్లెస్‌ నీకు ఎక్కడిది అని అడగ్గానే.. స్వాతి మీ రూం డోర్‌ దగ్గరే దొరికింది ఆంటీ అని చెప్తుంది. దీంతో భ్రమరాంబ, ఐశ్వర్య షాక్‌ అవుతారు. అప్పుడే రాజు మీరు ఏదో గొడవలో ఉన్నారు ఇక మేము వెళ్తాము అని రాజు వెళ్లిపోతుంటే ఐశ్వర్య రాజు ఆపేస్తుంది. అప్పుడే అపర్ణ డోర్ దగ్గరకు వచ్చి ఏదో చేస్తుంటే.. రేఖ చూచసి భూషణ్‌కు సైగ చేస్తుంది భూషణ్‌ వెళ్లి అపర్ణను లోపలికి పంపిచేస్తాడు. రాజును చూడటం అపర్ణ మిస్‌ అవుతుంది. రేఖ రాజును ఎక్కడుంటావని డీటెయిల్స్‌ అడగ్గానే.. రాజు చిరాకుగా వెళ్లిపోతాడు.

Advertisement

రాజు వెళ్లిపోయాక రేఖ కోపంగా ఐశ్వర్యను కొడుతుంది. నువ్వు తప్పు చేసి నన్ను తల దించుకునేలా చేశావు.. నా పెంపకాన్ని అవమనించావు.. ఎంత గొప్ప లైఫ్‌ ఇచ్చినా కుక్క తోక వంకర అన్నట్టుగా బిహేవ్‌ చేస్తున్నావు.. ఎంతైనా మీ నాన్న రక్తమే కదా నీలో ఉంది అంటూ వాడు కూడా ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇలాంటి చెత్త పనులే చేసేవాడు.. మీ నాన్నకు తగ్గ కూతురువి అయిపోయావు.. అంటూ చెడామడా తిట్టి ఐశ్వర్యను లోపలికి పంపిచేస్తుంది రేఖ.

అంతా లోపలి నుంచి విన్న అపర్ణ, ఇందు రూంలోకి వెళ్లగానే.. ఏంటి ఇందు అక్కడ గొడవ అంటూ అపర్ణ అడుగుతుంది. దీంతో జరిగిన విషయం అపర్ణ, సుభాష్‌లకు తెలిస్తే.. బాధపడతారని నిజం చెప్పకుండా ఏదో జరిగిందిలే నాన్నమ్మ అంటూ దాటవేస్తుంది. అయినా తాతయ్యకు మెడిసిన్స్‌ ఇచ్చావా..? అంటూ అడుగుతూ సుభాష్‌ దగ్గరకు వెళ్లి కూర్చుని ఇప్పుడెలా ఉంది తాతయ్యా అంటూ పలకరిస్తుంది. అప్పుడే అపర్ణ దగ్గరకు వెళ్లి మెల్లగా అసలు ఇంటర్వ్యూ ఏమైంది అని అడుగుతుంది. దీంతో అదా అదో పెద్ద కథలే అపర్ణాదేవి.. తర్వాత చెప్తాను అంటూ ఇందు బయటకు వెళ్తుంది.

Advertisement

మరోవైపు రూంలోకి వెళ్లిన భ్రమరాంబ కోపంగా స్వాతిని తిడుతుంది.  అసలు నీకు నెక్లెస్‌ ఎక్కడ దొరికింది అంటూ కోపంగా అడగ్గా స్వాతి మాత్రం కూల్‌గా రేఖ ఆంటీ రూం దగ్గర దొరికింది మమ్మీ అని చెప్తుంది. దీంతో భ్రమరాంబ మరింత కోపంగా అబద్దం చెప్తున్నాను.. అనగానే అయితే నిజం ఏంటో నువ్వే చెప్పు అని స్వాతి అడగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన శేషు ఆ నిజం మీ అమ్మ ఎందుకు చెప్తుంది అస్సలు చెప్పదమ్మా చెబితే తనే దొరికిపోతుంది కదా అనగానే.. భ్రమరాంబ గట్టిగా కోపంగా శేషు అంటుంది. శేషు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్వాతి కూడా వెళ్లిపోతుంది.

మరోవైపు సినిమా థియేటర్‌ దగ్గర ఉన్న వెంకీ లవర్‌తో కలిసి సినిమా చూడాలని జనం మాత్రం ఫుల్లుగా ఉన్నారు టికెట్స్‌ ఎలా అని ఆలోచిస్తుంటే నందు కనిపిస్తుంది. నందు దగ్గరకు వెళ్లి తనకు టికెట్స్‌ తీసుకొచ్చి హెల్ఫ్‌ చేయమని అడుగుతాడు. ఎందుకని నందు అడగ్గా బయట తన లవర్‌ రోజా వేయిట్‌ చేస్తుందని ఇద్దరం కలిసి సినిమా చూడాలని చెప్పగానే  నందు వెళ్లి టికెట్స్‌ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ టికెట్స్‌ తీసుకుని వెంకీ వెళ్లిపోతుంటే.. నందు కోపంగా ఇంతకీ ఆ అమ్మాయి నిన్నే ప్రేమిస్తుందా క్లారీటీ చూసుకో అని చెప్తుంది.

తర్వాత స్వాతి, ఇందు దగ్గరకు వెళ్లి రాజు, లక్కీ చాలా మంచి వాళ్లలా ఉన్నారని పొగుడుతుంటే ఇందు అసలు విషయం చెప్తుంది. వాళ్లు పెద్ద దొంగలు నేనే వాళ్లను భయపెట్టి ఇక్కడకు వచ్చి నెక్లెస్ ఇచ్చేలా చేశానని ప్లాష్ బ్యాక్ చెప్తుంది. దీంతో స్వాతి ఆశ్చర్యంగా ఇందును మెచ్చుకుంటుంది. మరోవైపు రూంలో కూర్చుని మందు తాగుతున్న రేఖ రాజునే గుర్తు చేసుకుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×