E-Paper
Advertisement

Varanasi Movie : ‘వారణాసి’లో హనుమంతుడి పాత్రలో స్టార్ హీరో.. జక్కన్న ప్లాన్ మాములుగాలేదుగా..

Varanasi Movie : ‘వారణాసి’లో హనుమంతుడి పాత్రలో స్టార్ హీరో.. జక్కన్న ప్లాన్ మాములుగాలేదుగా..
Advertisement

Varanasi Movie : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వారణాసి. ఈ కాంబోలో రాబోతున్న సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా కూడా అంతకుమించి ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీ టైటిల్ ఇటీవలే అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి కొన్ని పోస్టర్లు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తుంది. ఇందులో హనుమంతుడి పాత్రలో కన్నడ హీరో నటిస్తున్నట్లు వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. జక్కన్న ఎవరిని తీసుకురాబోతున్నారో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

వారణాసిలో హనుమంతుడుగా స్టార్ హీరో..

మాములుగా రాజమౌళి సినిమాలు అంటే జనాల్లో భారీ అంచనాలు ఉంటాయి.. ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలు బిగ్గెస్ట్ హిట్ అవుతాయి. ప్రస్తుతం అందరి దృష్టి వారణాసి మీదే ఉంది. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో సినిమా ఎలా ఉంటుందో చూడాలని ప్రిన్స్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ని నిర్వహించిన రాజమౌళి ఈ ఈవెంట్లో సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశాడు. దాంతో ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఆ గ్లింప్స్ చూస్తే ఈ మూవీ కూడా సైన్స్, చరిత్ర, పురాణాలను బేస్ చేసుకొని ఉండబోతుందనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది.. ఇందులో మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించునున్నాడు. హనుమంతుడి పాత్రలో కన్నడ హీరో సుదీప్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీని పై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక సుదీప్ ప్రస్తుతం సినిమాలతో పాటుగా టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Also Read :ఐబొమ్మ రవి స్టోరీలో ఇన్ని ట్విస్టులా.. అడుగడుగునా అవమానాలు.. విలన్ ఆమె..?

సుదీప్ ను జక్కన్న అందుకే సెలెక్ట్ చేశాడా? 

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినా సుదీప్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో ఆయనకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. అటు కన్నడ ఇండస్ట్రీలో సుదీప్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని మార్కెట్ పరంగా చూసిన, నటన పరంగా చూసిన సినిమాకి బాగా హెల్ప్ అవుతాడు అనే ఉద్దేశంతోనే రాజమౌళి అతన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా లో మహేష్ బాబు పాత్రతో సమానంగా హనుమంతుడు పాత్ర ఉండడంతో అతని రోల్ ఈ సినిమాకి కీలకంగా మారుతుందని స్పష్టమైంది. అసలు సినిమా ద్వారా రాజమౌళి ఏం చెప్పాలనుకున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజుల్లో రాబోతున్న పోస్టర్స్, టీజర్స్ వచ్చేవరకు వెయిట్ చెయ్యక తప్పదు..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×