IBOMMA Ravi : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ అటు సోషల్ మీడియాలను ఒకటే వార్త వినిపిస్తుంది.. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్. గత కొద్దిరోజులుగా ఈ విషయంపై సినీ ఇండస్ట్రీలో అనేక చర్చలు జరుగుతూ వస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు పైరసీకి గురి కావడంతో నిర్మాతలు ఆగ్రహానికి గురయ్యారు. సినిమాలని పైరసీ చేస్తున్న ఆన్లైన్ వెబ్సైట్ ఐ బొమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎంతో చాకచక్యంగా ఆ వెబ్సైట్ నిర్వాహకుడ్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ లో ఉంచారు. రవి అరెస్ట్ అయిన వెంటనే ఆయన హ్యాండిల్ చేస్తున్న ఐబొమ్మ, బప్పం టీవీ ల అకౌంట్ లను పోలీసులు బ్లాక్ చేయించారు.. రవి గురించి పూర్తి వివరాలను తెలుసుకొనే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ కేసు విచారణలో పోలీసులకు ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా రవి స్టోరీలో ఉన్న ట్విస్ట్ లను పోలీసులు బయటపెట్టారు.. కొన్ని అవమానాల వల్లే అతను పైరసి చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఆ స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ఇమ్మడి రవి మొదట్లో మంచి జాబ్ చేసేవాడట. ఆ తర్వాత టాలెంట్ తో రెండు కంపెనీలకు సీఈఓ గా మారడు. రవి ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్లపాటు వీరి సంసారం సాఫీగా సాగింది.. ఆ తర్వాత భార్య అత్త ఇద్దరు డబ్బులు సంపాదించలేవు. నువ్వేం మగాడివి అంటూ అతన్ని ప్రతిరోజు హేళన చేస్తూ మాట్లాడేవారని రవి విచారణలో తెలిపాడు.. డబ్బులు సంపాదించడం చేతకాని వాడివి అంటూ ఎన్నో రకాలుగా అవమానించారని రవి అన్నారు.. ఆ అవమానాలు భరించలేకే ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలనే కోరిక కలిగినట్లు రవి విచారణలో తెలిపినట్టు పోలీసులు చెప్తున్నారు.. వెబ్సైట్ డిజైనింగ్ నైపుణ్యంతో అతను ఐబొమ్మ, బప్పం టీవీ లను క్రియేట్ చేసినట్లు రవి విచారణలో తెలిపాడు. అలా పైరసి కింగ్ గా మారాడు. అదే అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తుంది.
Also Read : ధీరజ్, రామరాజు మధ్య చిచ్చు పెట్టిన శ్రీవల్లి.. ధీరజ్ షాకిచ్చిన ప్రేమ..భాగ్యం ఫుల్ హ్యాపీ..
ఐబొమ్మ, బప్పం టీవీ లు అందుబాటులోకి వచ్చిన తర్వాతే సినిమాలు పైరసికి గురవ్వడం జరిగింది. ఈ వెబ్ సైట్ల గురించి తెలుసుకున్న సినీ పెద్దలు దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోలేకపోయారు. గత కొన్నేళ్లుగా ఎక్కువగా కొత్త సినిమాలు పైరసీకి గురి కావడంతో నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ వెబ్సైట్ పై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వెబ్సైట్ గురించి కూపి లాగే పనిలో పడ్డారు.. ఈ క్రమంలో నిర్వాహకుడు రవి గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. మొత్తానికి విదేశాల్లో ఉన్న రవి ఇండియాకి రావడం పై పక్క సమాచారం తెలుసుకున్న పోలీసులు అతన్ని ప్రణాళిక ప్రకారం అరెస్టు చేశారు.. ప్రస్తుతం రవిని రిమాండ్ లో ఉంచారు. ఈ విచారణ త్వరలోనే పూర్తి చేస్తామని పోలీసులు అంటున్నారు. అయితే నాంపల్లి హైకోర్టులో ఐబొమ్మ రవి బెయిల్ కోసం పిటిషన్ వెయ్యనున్నట్లు తెలుస్తుంది. మరి కోర్టు అతనికి బెయిల్ ఇస్తుందా? లేక షాక్ ఇస్తుందా తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ కేసు మాత్రం సంచలనంగా మారింది..