E-Paper
Advertisement

Kannada : కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Kannada : కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత..
Advertisement

Kannada : కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.. కన్నడ లో నటుడు నిర్మాత అయిన దిలీప్ రాజ్ కన్ను మూశారు.. ఇవాళ తెల్లవారుజామున ఆయన గుండెపోటు కారణంగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి చికిత్స కోసం తీసుకెళ్లారు. అతని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన మరణ వార్త మీ కుటుంబ సభ్యులు వెల్లడించారు.. ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు తలుచుకొని ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. ఆయనతో నటించిన పలువురు నటీనటులు దిలీప్ రాజ్ కు ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్థించారు. ఇండస్ట్రీలో ఒక గొప్ప నటుడు మరణించారు అని తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఆసుపత్రి నుంచి ఇంటికి ఆయన భౌతిక కాయన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన సన్నిహితులు ప్రముఖ సినీ నటులు నివాళులర్పించారు.. ఇవాళ సాయంత్రం కర్ణాటకలోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తుంది.. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం..

దిలీప్ రాజ్ మరణంతో విషాదం.. 

ఈ మధ్య ప్రతి ఇండస్ట్రీలోని నటీనటులు చాలా మంది గుండెపోటు కారణంగా మృతి చెందుతున్నారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.. ఇండస్ట్రీలోని ప్రముఖ నటుడు నిర్మాత అయిన దిలీప్ రాజ్ గుండెపోటు కారణంగా ఇవాళ ఉదయం మృతి చెందారు.. బుధవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.. దాంతో ఈ విషయాన్ని ఈ కుటుంబ సభ్యులు ఆయన మరణించినట్టు ప్రకటించారు.. ఎన్నో సినిమాలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న గొప్ప నటుడు దిలీప్.. ఈయన మరణ వార్త విన్న సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.. ఫిలిం ఛాంబర్ లో ఆయన భౌతిక కాయాన్ని సందర్శన అనంతరం ఖననం జరిపించినునట్లు తెలుస్తుంది..

దిలీప్ రాజ్ కెరీర్ విషయానికొస్తే…

Advertisement

2007లో పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మిలానా’లో ఈయన పోషించిన పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘యు-టర్న్’ మూవీలో నటించి మరోసారి ఆయన నటనతో మంచి మార్కులు వేయించుకున్నారు. కేవలం ఈయన వెండితెర పై మాత్రమే కాదు.. అటు బుల్లితెరపై కూడా పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసులో నటుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు.. నిర్మాతగా కూడా వ్యవహరించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా తన ప్రతిభను చాటుకున్న దిలీప్ రాజ్ మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆయనకు సంతాపం తెలుపుతున్నారు..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×