E-Paper
Advertisement

300 కి.మీ రేంజ్.. చౌక ధర.. BYD సెల్ప్ డ్రైవింగ్ ఈవీ వచ్చేస్తోంది!

300 కి.మీ రేంజ్.. చౌక ధర.. BYD సెల్ప్ డ్రైవింగ్ ఈవీ వచ్చేస్తోంది!
Advertisement

BYD’s Smallest EV: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD మరో క్రేజీ ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. అత్యంత చౌకైన, చిన్న ఎలక్ట్రిక్ కారును అత్యాధునిక సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో మార్కెట్ కు పరిచయం చేయబోతోంది. కంపెనీ తయారు చేస్తున్న సీగల్ అనే చిన్న EVలో ఇప్పుడు LiDAR సెన్సార్ ఆధారిత డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్స్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఇదే కారును ఆస్ట్రేలియా మార్కెట్‌ లో  అట్టో 1  పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతోంది.

తక్కువ ధరలో అందుబాటులోకి!

ఈ కారులో కొత్త టెక్నాలజీని యాడ్ చేస్తున్నప్పటికీ, ధర తక్కువగానే ఉంటుందని BYD వెల్లడించింది. చైనాలో ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ధర సుమారు 14 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉండొచ్చని సమాచారం. భారత కరెన్సీలో సుమారు రూ.9.5 లక్షల నుంచి రూ.9.6 లక్షల వరకు మధ్య ఉంటాయి. ప్రస్తుతం 1 ఆస్ట్రేలియన్ డాలర్ దాదాపు రూ. 68 వరకు ఉంటుంది. BYD ఇటీవల సోషల్ మీడియా వీబోలో చేసిన పోస్టులో, 2026 సీగల్ కొత్త డిజైన్, మరిన్ని ఫీచర్లతో వస్తోంది. ధర అందుబాటులోనే ఉంటుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ చిన్న EVపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది.

LiDAR సెన్సార్ ఏర్పాటు

Advertisement

కొత్త వెర్షన్‌ లో 12 కెమెరాలు, 5 mm- వేవ్ రాడార్లు,  అల్ట్రాసోనిక్ సెన్సార్లు, ఓ LiDAR సెన్సార్ ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా LiDAR సెన్సార్‌ ను కారు రూఫ్ మీద అమర్చనున్నారు. సాధారణంగా ఈ టెక్నాలజీ ఖరీదైన కార్లలో మాత్రమే కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు BYD తక్కువ ధర కారులో తీసుకురాబోతోంది.

ఏంటీ LiDAR సెన్సార్ ప్రత్యేకత?

LiDAR అనేది రోడ్డు మీద ఉన్న వాహనాలు, లేన్ల వివరాలను మరింత కచ్చితత్వంతో గుర్తించే టెక్నాలజీ. ఇది సెల్ఫ్ డ్రైవింగ్,  అడ్వాన్స్‌ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ లో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల హైవే డ్రైవింగ్, ఆటోమేటిక్ లేన్ మార్పులు, ట్రాఫిక్‌ లో సహాయక డ్రైవింగ్ లాంటి ఫీచర్లు మరింత యాక్టివ్ గా పని చేస్తాయి. ఈ టెక్నాలజీతో సీగల్‌ లో నావిగేట్ ఆన్ ఆటోపైలెట్(NOA) ఫీచర్ కూడా వచ్చే అవకాశముంది. దీని ద్వారా హైవేలు, సిటీ రోడ్లపై కారు ఆటోమేటిక్ గా నావిగేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి ఫీచర్లు ఎక్కువగా ప్రీమియం కార్లలో మాత్రమే ఉండేవి. ఇప్పుడు సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానున్నాయి.

అమ్మకాల్లో సీగల్ దూకుడు

Advertisement

అమ్మకాల పరంగా కూడా సీగల్ కంపెనీకి అత్యంత కీలకమైన మోడల్‌గా మారింది. ఈ కారు విడుదలైన కొద్ది కాలంలోనే లక్షల సంఖ్యలో యూనిట్లు అమ్ముడయ్యాయి. మూడు సంవత్సరాల లోపే 10 లక్షలకు పైగా యూనిట్లు సేల్ అయ్యాయి.  ఇప్పుడు ఈ మోడల్‌ను ప్రపంచ మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఒకే ఛార్జ్ తో 300 కి.మీ ప్రయాణం

ఆస్ట్రేలియాలో  అట్టో 1  పేరుతో వచ్చే ఈ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియంట్‌లో 30 kWh బ్యాటరీ ఉండగా, టాప్ మోడల్‌లో 43.2 kWh బ్యాటరీ ఇస్తున్నారు. చిన్న బ్యాటరీతో సుమారు 220 కిలోమీటర్ల రేంజ్ లభిస్తే, పెద్ద బ్యాటరీతో దాదాపు 310 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Read Also: మాగ్నైట్ To ఫార్చ్యూనర్.. ఇండియన్ మార్కెట్లో హిట్ కొట్టిన టాప్ 5 జపనీస్ SUVలు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×