E-Paper
Advertisement

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!
Advertisement

Kavya – Anirudh:సోషల్ మీడియాలో ఒక జంట గురించి ఏదైనా ఒక రూమర్ తెరపైకి వచ్చింది అంటే కచ్చితంగా ఆ రూమర్ నిజమవుతుందనే చెప్పాలి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా సన్ గ్రూప్ అధినేత కళానిధి కూతురు , సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ తో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే వీరిద్దరూ స్నేహితుల మాత్రమేనని, రెండు కుటుంబాలు కూడా అధికారికంగా స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టారు.

కావ్య – అనిరుధ్ పెళ్లికి తెలంగాణ సీఎంకు ప్రత్యేక ఆహ్వానం..

కానీ గత కొన్ని రోజుల క్రితం అనిరుద్ రవిచందర్ బంధువు వీరి పెళ్లిపై చేసిన కామెంట్లు మరింత వైరల్ గా మారాయి. కానీ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన ఫోటోలను బట్టి చూస్తే ఇక వీరి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. కళానిధి మారన్, కావేరి మారన్ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ ఆయన నివాసంలో గౌరవప్రదంగా కలిశారు. ఈ మేరకు తమ కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని సతీసమేతంగా ఆహ్వానించారు. అయితే ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ముఖ్యంగా ఈ విందు నవంబర్ 21 చెన్నైలో జరుగుతుందని స్పష్టం చేసింది.

కేటీఆర్ కుటుంబాన్ని ఆహ్వానించిన కళానిధి మారన్ దంపతులు..

Advertisement

అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను , ఆయన భార్య శైలిమలను కూడా కళానిధి మారన్ దంపతులు హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమార్తె కావ్య, కాబోయే అల్లుడు అనిరుద్ ల పెళ్లి రిసెప్షన్ కు రావాల్సిందిగా ఈ సందర్భంగా ఆహ్వానించారు. నవంబర్ 21న చెన్నైలో నిర్వహించనున్న ఈ ఫంక్షన్ కి కుటుంబ సమేతంగా రావాలి అని ఆహ్వాన పత్రికను కేటీఆర్ దంపతులకు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.. దీంతో పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు ,అభిమానులు కావ్య, అనిరుద్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

అధికారికంగా ప్రకటించేది ఎప్పుడు..?

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఈ జంట పెళ్లి వార్త మళ్ళీ ఇప్పుడు చర్చంగా మారింది. ఇక అనిరుద్ కావ్య మారన్ కుటుంబాలు పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఆహ్వాన పత్రిక అందుకున్న వారు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే కావ్య , అనిరుద్ ఇరువురు 2025 నుంచి ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే తమ కూతురు గురించి వినిపిస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని ఇరు కుటుంబాలు వెల్లడించాయి. అటు అనిరుధ్ బంధువు నటుడు వైజి మహేంద్రన్ కూడా గత జూన్ లో ఒక ఇంటర్వ్యూలో అనిరుద్ వివాహ విషయాన్ని వెల్లడించారు.

Advertisement

also read:త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

డెస్టినేషన్ వెడ్డింగ్..

ఇకపోతే ఈ జంట గ్రీస్ లో డెస్టినేషన్ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 11న పెళ్లి జరిగే అవకాశం ఉందని , ఇక నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్ జరిగే అవకాశం ఉందని సమాచారం.. ఇక కావ్య అనిరుద్ ఎప్పుడు తమ పెళ్ళి తేదీని అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

Big Stories

Advertisement
×