E-Paper
Advertisement

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?
Advertisement

Bigg Boss 10:వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత వైల్డ్ ఫైర్ మొదలవుతుంది అని నాగార్జున ఎలా అయితే చెప్పుకొచ్చారో.. ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు త్రిగుణ్.. ఒక్కడి కోసం కాకుండా అందరి కోసం ఆట ఆడుతూ ఇది కదా అసలైన గేమ్ అనిపిస్తూ అందరి చేత ఔరా అనిపించుకుంటున్నారు. మొదట్నుంచి వివాదాలకు పెద్దగా చోటు ఇవ్వకుండా.. గేమ్‌లో కాన్సెంట్రేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈయన తాజాగా ఆడిన గేమ్‌తో మరోసారి ఎక్కడికో వెళ్లిపోయారు.6 వారాలుగా హౌస్ మేట్స్ అంతా కింద మీద పడుతూ కంటెండర్ షిప్ కోసం పోటీ పడుతుంటే .. అని వైల్డ్ కార్డ్స్ వచ్చి ఎగురవేసుకుపోతామంటే ఊరుకుంటామా అనే రేంజ్ లో తన మాస్టర్ గేమ్ ఆడి వైల్డ్ కార్డ్స్ కి చుక్కలు చూపించారు. అంతేకాదు ప్రోమో చివర్లో శివ వెల్కమ్ టు ది బిగ్ బాస్ హౌస్.. ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటూ చెప్పిన డైలాగ్ మరింత ఆకట్టుతుంది. మరి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

వైల్డ్ కార్డ్స్ కి చుక్కలు చూపించిన హౌస్ మేట్స్..

బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్స్, హౌస్ మేట్స్ ను కలిపి మొత్తం మూడు టీములుగా బిగ్ బాస్ విడగొట్టిన విషయం తెలిసిందే. గ్రీన్, బ్లూ , గోల్డ్ పేరిట 3 టీములుగా విడగొట్టారు. ఇకపై ఆడే ప్రతి ఆటలో మూడు టీములు నుండి ఒక్కొక్కరు ఒక్కో టాస్క్ లో పోటీ పడాల్సి ఉంటుంది.. అందులో భాగంగానే తాజాగా నిర్వహించిన టాస్క్‌లో.. అక్కడ ఉన్న బాల్ ను ఎవరైతే ముందుగా తీసుకొని స్లాట్‌లో వేస్తారో వారే ఆ రౌండ్ లో విజయం సాధిస్తారు అంటూ చెబుతూ..సంచాలక్ గా నీతూని నియమించారు బిగ్ బాస్. అలా గోల్డ్ తరపున శివ్, గ్రీన్ తరపున వంశీ, బ్లూ తరఫున రోహిత్ పోటీపడ్డారు. ఆ తర్వాత మూడు టీముల నుండి ఒక్కొక్కరు వచ్చి టాస్క్ లో పోటీపడ్డారు.

శివ్ కి ఊహించని దెబ్బ..

Advertisement

ఇకపోతే గ్రీన్ కి ఛాన్స్ ఇవ్వకుండా గోల్డ్ టీం తో బ్లూ టీం దేబ్జానీ చాన్స్ కావాలని అడుగుతుంది. అయితే గోల్డ్ టీం వ్యక్తీ బ్లూ టీం వ్యక్తికి తన చేతిలోని బాల్ ఇచ్చాడు. అయితే అనూహ్యంగా బ్లూ టీం త్రిగుణ్ , గ్రీన్ టీం అమన్ కి బాల్ ఇచ్చి టాస్క్ పూర్తి చేయమన్నాడు. అలా త్రిగుణ్ మాస్టర్ మైండ్ కి గ్రీన్ టీం గెలవడంతో శివ్ ఎర్రిపప్ప అయిపోయాడు అంటూ ప్రోమో చూసిన ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. మోసంపోయామని తెలుసుకోవడంతో అమన్, శివ్ తొడలు కొట్టుకునే అంతవరకు గొడవ జరుగుతుంది. ఆరు వారాలు కింద మీద పడి ఆడింది ఎవరు? అంటూ అడుగుతారు.

also read:జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

త్రిగుణ్ మాస్టర్ మైండ్ అదుర్స్..

Advertisement

త్రిగుణ్ , సుధీర్ దేబ్జానీ మాట్లాడుతూ.. నువ్వున్నావా ఈ ప్లాన్ లో అని సుదీర్ ని అడగగా.. సుధీర్ నాక్కూడా తెలియదు. దీనంతటికీ త్రిగుణ్ అన్న ధూత అంటూ చెప్పాడు . త్రిగుణ్ మాట్లాడుతూ.. కెప్టెన్సీ వచ్చి కోల్పోయిన వాడు.. కెప్టెన్సీ కోసం ఎదురుచూస్తున్న వాడు.. కోసం పోరాడు. ఇంతమంది ఉన్నప్పుడు రోహిత్ ని కెప్టెన్సీ కంటెండర్ కావడానికి నేను ఇక్కడ గేమ్ ఆడుతున్నానా అంటూ మండిపడ్డారు.ఇక శివతో త్రిగుణ్ మాట్లాడుతూ.. శివ వెల్కమ్ టు ది బిగ్ బాస్ టెన్.. ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటూ జలక్ ఇచ్చాడు. మొత్తానికైతే త్రిగుణ్ మైండ్ గేమ్ ఆట అందరిని ఆశ్చర్యపరిచింది.

 

Related News

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

ఏంటి.. సుధీర్ కి అప్పుడే పెళ్ళైపోయిందా.. వైరల్ అవుతున్న పిక్స్!

దక్షనే నా భార్య.. కన్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ!

Gundeninda Gudigantalu : ప్రభా టాలెంట్ కు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే.. సూపర్ అంతే..

బాధ్యత ఉండక్కర్లేదా.. ‘అలయన్స్ ఎయిర్ లైన్స్’ పై యాంకర్ గాయత్రి అసహనం..వీడియో వైరల్!

Intinti Ramayanam Pallavi : పల్లవి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×